సినిమా ఇండస్ట్రీ లో ఒకే తరహా కథతో రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదల అయినట్లయితే ఆ జోనర్ కథలకు మంచి క్రేజ్ ఉన్నట్లయితే మొదటగా విడుదల అయిన సినిమా మంచి విజయాన్ని అందుకోవడం , ఆ తర్వాత విడుదల అయిన సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం జరగడం సర్వ సాధారణమైన విషయం. ఇకపోతే ఒకే రకం కథతో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు రెండు ఒకే రోజు విడుదల అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏవి .? అందులో హీరోలుగా నటించిన వారు ఎవరు .? చివరకు వాటి రిజల్ట్ ఏమయింది అనే వివరాలను తెలుసుకుందాం.
మలయాళం లో మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఆర్యన్ అనే సినిమాను బాలకృష్ణ హీరోగా అశోక చక్రవర్తి అనే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ 1989 జూన్ 29 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. భానుప్రియ ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా నటించగా ... ఇళయరాజా ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇక విక్టరీ వెంకటేష్ "ధృవ నక్షత్రం" అనే పేరుతో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా 1989 జూన్ 29 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా రజిని నటించగా ... చక్రవర్తి మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఒకే రోజు విడుదల అయిన ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రెండు మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమాలలో వెంకటేష్ హీరోగా రూపొందిన ధ్రువ నక్షత్రం సినిమా మంచి విజయాన్ని అందుకోగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన అశోక చక్రవర్తి సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.