అప్పుడు "ఊ అంటావా మావ"..ఇప్పుడు "దెబ్బలు పడతయిరో రాజా"..రెండు పాటలల్లో ఇది కామన్..గమనించారా..!

Thota Jaya Madhuri
కిస్ కిస్ కిస్ కిస్సికా.. కిస్సా కిస్స కిస్ కిస్సికా.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ లిరిక్స్ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కూడా తెలుసు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది శ్రీ లీల.  కెరియర్ లో ఫస్ట్ టైం శ్రీలీల ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది . దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు.  దేవి మ్యూజిక్ లో సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సినిమా అంటే కచ్చితంగా ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.


అదే రేంజ్ లో పుష్ప2 ఐటం సాంగ్ కూడా ఉంటుంది అంటూ జనాలు ఎక్స్పెక్ట్ చేశారు . కానీ ఎందుకో  ఆ విషయంలో దేవి కూసింత వెనుకబడిపోయారు.  పాట లిరిక్స్ చంద్రబోస్ రాశారు . దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు . కానీ ఈ పాట ఎందుకో అంత ఊపు తెప్పించలేకపోయింది ..అంత కిక్ లేదు అంటున్నారు జనాలు . దెబ్బలు పడతాయి రా రాజా.. పాటకి  ఊ అంటవ మావ పాట క్రేజ్ రాలేదు అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఈ రెండు పాటల్లో మాత్రం చంద్రబాబు ఒక విషయాన్ని ఎక్కువగా హైలెట్ చేస్తూ చూపించారు అంటూ చెప్పుకొస్తున్నారు .


అమ్మాయిలు ఇబ్బంది పడే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఆయన లిరిక్స్ రాశారు అని.. మరీ ముఖ్యంగా ఊ అంటావా మావ లో  ఆఖరి చరణం లో వచ్చే "దీపాలన్నీ ఆర్పేశాక అందరు బుద్ధి వంకర బుద్ధే" అని ఒక నిజమైన ఘాటు పదాన్ని ఎలా వాడారో.. సేమ్ దెబ్బలు పడతాయి రా రాజా పాటలో "ఫోటోలు తీసుకో సూసుకో కానీ మార్ఫ్  చేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకు" అంటూ ఘాటుగా చెప్పుకొచ్చారు ..అని రెండు పాటలలోను ఆడవాళ్లు పడే బాధలను చంద్రబోస్ క్లియర్గా రాశారు అని ..అదే విషయాన్ని సుకుమార్ కూడా బాగా హైలైట్ చేస్తూ చూపించారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు పాటల్లో  ఆడవాళ్లు పడే బాధలను కామన్ గా చూపించారు . ఈ పాటకు సంబంధించిన విషయాన్ని బాగా టృఎండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . చూడాలి ఊ అంటావా మామ పాటను బీట్ చేస్తుందో లేదో ఈ దెబ్బలు పడతాయిరో రాజా పాట..!!??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: