నాగచైతన్య ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతి లెక్క చెప్పు సమంతా... ?
దేనికి ఆమె తడుముకోకుండా సమాధానం ఇచ్చింది . నా మాజీకి ఇచ్చిన ఖరీదైన బహుమతులు అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంటే ఆ ఖరీదైన బహుమతులు .. వాటికి పెట్టిన ఆ డబ్బుతో పాటు టైం అంతా వేస్ట్ చేసుకున్నాను అన్న అర్థంలో సమంత మాట్లాడింది. కలకాలం నిలిచి ఉంటుందనుకున్న బంధం నిలబడలేదు.. నాగచైతన్య - సమంత విడిపోయారు. అలా అతడికి ఇచ్చిన ఖరీదైన బహుమతులు అన్ని వేస్ట్ అయ్యాయి అన్నది సమంత ఉద్దేశం. ఈ విషయంలో నాగచైతన్య పై కాస్త భారీగానే ఖర్చు చేశారంటూ సమంత సమాధానం ఇచ్చింది.
అయితే సమంత ఆన్సర్ అక్కినేని అభిమానులకు ఎంత మాత్రం నచ్చలేదు. దీంతో సమాంత ను వాళ్ళు రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. వైవాహిక బంధం లో ఉన్నప్పుడు నాగచైతన్య కూడా ఖరీదైన బహుమతులు ఇచ్చే ఉంటాడని వాటి గురించి మాట్లాడకుండా తను మాత్రమే కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చినట్టు సమంత మాట్లాడుతుందని ఆరోపిస్తున్నారు. నిజానికి రిలేషన్ షిప్ లో అమ్మాయి కంటే అబ్బాయిల ఎక్కువగా బహుమతులు ఇస్తుంటారని .. సమంత విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని అలాంటప్పుడు నాగచైతన్య ఇచ్చిన ఖరీదైన బహుమతులు కూడా వృధా అయినట్టుగానే భావించాలా ఆ లెక్కలు కూడా చెప్పు సమంత అని ప్రశ్నిస్తున్నారు.