టాలీవుడ్ లో ఆ హీరోయిన్లదే హవా.. యవ్వారం గట్టిగానే ఉందిగా..!

Amruth kumar
గతంలో తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్లు అంటే ఎక్కువ నార్త్ నుంచి వ‌చ్చిన‌ భామలే కనిపించేవారు .. అందులోను ముంబాయి నుంచి ఎక్కువగా వచ్చేవారు. మోడలింగ్ నుంచి నటులుగా మారిన వారంతా టాలీవుడ్ లోనే కనిపించేవారు. ఇక బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ , కొలీవుడ్ ఇండస్ట్రీలు పెద్దగా ఉండేవి .. దాంతో వాళ్లకు ఈ రెండు పరిశ్రమలే మంచి అవకాశాలు ఇచ్చేవి. ఇక దర్శక - నిర్మాతలు కూడా వారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇతర భాషల హీరోయిన్లకు ఇచ్చేవారు  కాదు.

అయితే బాలీవుడ్ లో సక్సెస్ అయిన చాలా మంది హీరోయిన్ల ట్రాక్ రికార్డు చూస్తే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మారిన ముద్దుగుమ్మల పేర్లే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు వీళ్ళకి పోటీగా కేరళ , బెంగళూరు భామలు కూడా హీరోయిన్లగా అడుగుపెట్టేవారు. అయితే నార్త్‌ నుంచి వచ్చిన హీరోయిన్ల పోటీని మాత్రం చాలా విషయాల్లో తట్టుకోలేకపోయేవారు. అలా సౌత్ భామలు నార్త్ భామల కారణంగా వెనకబడి ఉండేవారు. అయితే ఇప్పుడు దశాబ్ద కాలంగా ఈ ట్రెండ్ మారింది. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లకు బదులుగా సౌత్ హీరోయిన్లకు పెద్దపీట వేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారంతా మలయాళం , కన్నడ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. కీర్తి సురేష్ , అనుప‌మ ప‌ర‌మ‌శ్వ‌ర‌న్ , సంయుక్తా మీనన్ , ప్రియాంక అరుల్ మోహ‌న్ , శ్ర‌ద్దా శ్రీనాధ్ , సాయి ప‌ల్ల‌వి , న‌య‌న‌తార , స‌మంత వీళ్లంతా సౌత్ భామ‌లే. సౌత్ భామ‌ల ఎంట్రీ తో సినిమాల‌కు చాలా ర‌కాలుగా క‌లిసొచ్చింది . వీళ్లంతా నేచుర‌ల్ పెర్పార్మెర్లు. నేచుర‌ల్ బ్యూటీలు. ప్ర‌తీ సంద‌ర్భంలోనూ మ్యాక‌ప్ లు అవ‌స‌రం లేదు . రియ‌లిస్టిక్ ముఖాల‌తో కెమెరా ముందుకొచ్చిన భామ‌లు చాలా మంది ఉన్నారు . హీరోల‌కు పోటీగా డాన్సులు , న‌ట‌న చేయ గ‌ల‌రు . నార్త్ భామ‌ల‌తో పోల్చితే ఈ విష‌యంలో ద‌ర్శ‌కు ల‌కు ఎంతో కంప‌ర్ట్ కుదురుతుంది. అయితే గ‌తంలో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సౌత్ భామ‌లు ఆస‌క్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడా భామ‌ల మ‌ధ్య‌నే తీవ్ర‌మైన పోటీ ఉండ‌టంతో ? ఎందులోనూ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఒక‌రికొక‌రు పోడీ ప‌డి ముందుకొస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: