Lucky Bhaskar: స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?
మలయాళం స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా 'మహానటితో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతారామం' సినిమాతో నేరుగా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు 'లక్కీ భాస్కర్' అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు హీరోగా పేరు దక్కించుకున్నారు. ఈచిత్రానికి డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.
ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన ప్రముఖ లీడింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.. దీపావళి 31న విడుదల కావలసి ఉండగా.. ఆ రోజు అమావాస్య కావడం తో ఒకరోజు ముందుగానే, అనగా అక్టోబర్ 30వ తేదీన సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదటి రోజే రూ.12.7 కోట్లు కొల్లగొట్టి అద్భుతమైన స్టార్ట్ అందుకున్న ఈ సినిమా, 25 రోజులు థియేటర్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది ఈ సినిమా.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఇక ఈనెల 28వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం. ఇకపోతే లక్కీ భాస్కర్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..రిలీజ్ అయిన 3 వారాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, దుల్కర్ సినీ కెరియర్ లోనే మొట్టమొదటి రూ.100 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. థియేటర్లలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీకి కూడా సిద్ధమైంది. మరి ఓటీటీ లో ఎటువంటి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.