పేరుకే.. స్టార్ కిడ్.. ఒక్క హిట్ కూడా లేదుగా..?

Divya
సినీ ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు, వారసురాలు ఈ మధ్యకాలంలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉండగా మరి కొంతమంది ఫెయిల్యూర్ గాని మిగిలిపోతున్నారు. అయితే అలా స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో సక్సెస్ లేని హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.. ఈమె ఎవరో కాదు హీరో రాజశేఖర్, జీవిత  కుమార్తె శివాత్మిక.. ఈమె మొదటిసారి దొరసాని అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన తను నటనకి మంచి మార్కులు పడ్డ ఎందుకో సక్సెస్ అందుకోలేకపోయింది.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందంతో అదిరిపోయే గ్లామర్ తో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా తమిళ ఇండస్ట్రీలోకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళినా కూడా అక్కడ రెండు మూడు చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగమార్తాండ చిత్రంలో కూడా ఈమె నటించిన ఈ సినిమా కూడా సాలిడ్ హిట్టుని అందుకోలేకపోయింది.. అందం అభినయంతో ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్న ఈ స్టార్ కి కొత్త సినిమాల విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అందుకే శివాత్మిక కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటే గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న శివాత్మిక.. ఈమెకు మరొక సోదరి కూడా ఉన్నది ఆమె శివాని రాజేశేఖర్.. ఈమె కూడా తన నటనతో అందంతో మంచి మార్పులే సంపాదించుకున్న ఒక మోస్తారు హిట్లతో ముందుకు వెళ్తోంది. మరి ఈ అక్క చెల్లెలు ఇద్దరికీ కూడా సరైన హిట్ అందుకొని తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించాలి అంటూ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇక రాజశేఖర్ కూడా ఈ మధ్యకాలంలో అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: