సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. సుకుమార్ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా వరకు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలలోని స్పెషల్ సాంగ్స్ కూడా చాలా వరకు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇకపోతే కొంత కాలం క్రితం సుకుమార్ "పుష్ప పార్ట్ 1" అనే సినిమాను తెరకెక్కించాడు. ఇందులో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం సమంత ఏకంగా 1.5 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నట్లు అప్పట్లో ఓ వార్త వైరల్ అయింది.

పుష్ప పార్ట్ 1 సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 ను రూపొందిస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ 2 లో సమంత కంటే క్రేజ్ ఉన్న బ్యూటీతో స్పెషల్ సాంగ్ చేయించనున్నారు అని ,  అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు శ్రద్ధ కపూర్ ను సంప్రదించగా ఆ బ్యూటీ మాత్రం భారీ మొత్తంలో పారితోషకాన్ని డిమాండ్ చేయడంతో ఈ మూవీ యూనిట్ డ్రాప్ అయినట్లు ఓ వార్త వైరల్ అయింది. చివరగా ఈ మూవీ యూనిట్ శ్రీ లీలతో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ను చేయించింది. ఈ ముద్దుగుమ్మ ఈ సాంగ్ కోసం కోటి రూపాయలు పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానితో పుష్ప పార్ట్ 2 స్పెషల్ సాంగ్ విషయంలో సుకుమార్ చాలా వరకు తగ్గాడు అని ఫస్ట్ పార్టీ టి పోలిస్తే పార్ట్ 2 స్పెషల్ సాంగ్ కు చాలా తక్కువ ఖర్చు పెట్టారు అని నిర్మాతలకు డబ్బు మిగిల్చడానికి సుకుమార్ అలాంటి పని చేశాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: