పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేస్తాయి.. అంతలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్ ఏర్పరుచుకున్నారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో వున్నారంటే ఆయనకీ యూత్ లో వున్న పాపులరిటీనే కారణం.. పవన్ కల్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. అయితే పవన్ కల్యాణ్ కెరీర్ లో చాలా వరకు ప్లాప్స్ వున్నాయి.. కానీ అవేమి కూడా ఆయన స్టార్ డం ని తగ్గించలేకపోయాయి. పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది.. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఆ సినిమా తరువాత పవన్ కల్యాణ్ నటించిన ప్రతీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..కానీ ఆ అంచనాలు మాత్రం ఏ సినిమా తీర్చలేకపోయింది.. అయితే 2008 ఏప్రిల్ 2 న రిలీజ్ అయిన “జల్సా” సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి భారీ ఊరటను ఇచ్చింది.. దాదాపు ఏడేళ్ల తరువాత పవన్ కల్యాణ్ రేంజ్ కి తగ్గ సినిమాగా జల్సా మూవీ నిలిచింది..
ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు.. తన పదునైన మాటలతో త్రివిక్రమ్ ఎంతగానో మెప్పించాడు.. అంతే కాదు ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ దేవిశ్రీ మ్యూజిక్.. పవన్ కల్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు.. అప్పట్లో ఎక్కడ చూసిన కూడా జల్సా పాటలే వినిపించేవి ..ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం అప్పట్లో సంచలనం గా మారింది.ఈ సినిమాలో నక్స్లైట్ గా పవన్ కల్యాణ్ చెప్పే ప్రతీ డైలాగ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.. అయితే ఈ సినిమా టైటిల్ కి సినిమా కథకు సంబంధం లేదు.. ముందుగా ఈ సినిమాకి "సంజయ్ సాహు" అనే టైటిల్ పెడదామని మేకర్స్ అనుకున్నారట.. కానీ 'జల్సా' అనే పేరు క్రేజీ గా ఉండటంతో ఈ టైటిల్ సూచించిన్నట్లు తెలుస్తుంది.మనం గెలవాలంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం అనే ఒక్క డైలాగ్ సినిమాకు అమాంతం హైప్ తీసుకొచ్చింది.. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ లో మరో అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది..