ఐస్ క్రీమ్ : కథకు సంబంధం లేని టైటిల్.. చివరకు అలాంటి రిజల్ట్..?

Pulgam Srinivas
ఒక సినిమా రూపొందుతుంది అంటే ఆ సినిమా దర్శకులు , నిర్మాతలు ఒక టైటిల్ ను పెట్టాలి అంటే చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే సినిమా కథకు తగ్గట్టు టైటిల్ ఉంటే జనాలు కూడా కథకు తగ్గ టైటిల్ పెట్టారు పర్వాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కొన్ని సినిమాలు మాత్రం కథకి , టైటిల్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటాయి. మూవీ మేకర్స్ టైటిల్ ను అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ బాగుంది. సినిమా కథకు ఏమైనా సంబంధం ఉంటుందా .? సంబంధం ఉంటే దీనిని ఎలా తెరకెక్కిస్తారు అనే క్యూరియాసిటీ కూడా జనాల్లో నెలకొంటూ ఉంటుంది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో మాత్రం ఒక్క చెప్పుకోదగ్గ సినిమాను కూడా తెరకెక్కించలేదు. దానితో ఈయనకు దర్శకుడిగా పెద్దగా క్రేజ్ కూడా లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ దర్శకుడు నవదీప్ హీరోగా తేజశ్రీ మదివాడ హీరోయిన్గా ఐస్ క్రీమ్ అనే సినిమాను రూపొందించాడు. ఇక ఐస్ క్రీమ్ అనే టైటిల్ ను అనౌన్స్ చేయడంతో ఐస్ క్రీమ్ అనే టైటిల్ ను పెట్టారు. ఇదేదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అయి ఉంటుంది అని అనుకున్న జనాలు కూడా ఉన్నారు.

ఇక తీరా సినిమా విడుదల అయ్యాక ఐస్ క్రీమ్ అనే టైటిల్ కు ఈ సినిమా కథకు ఏ మాత్రం సంబంధం లేదు. ఇక ఈ సినిమా చెప్పుకోదగ్గ రీతిలో కూడా లేకపోవడం , అలాగే టైటిల్ కి సినిమాకు అస్సలు సంబంధం లేకపోవడంతో జనాలు చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను ఎదుర్కొంది. 2014 వ సంవత్సరం జూలై 12 వ తేదీన విడుదల ఆయన ఈ సినిమాకు పద్యోతన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: