టాలీవుడ్ సిల్వర్ జూబ్లీ మూవీలు ఇవే.. ఏ హీరోకు ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు షిఫ్ట్ వైస్ గా కాకుండా నేరుగా 175 రోజుల ఆడి సిల్వర్ జూబ్లీని జరుపుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మొదటగా తెలుగు సినిమా పరిశ్రమలో 1948 వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన బాలరాజు సినిమా రెండు థియేటర్లలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది.

ఆ తర్వాత ఎక్కువ సెంటర్లలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పాతాళ భైరవి 175 రోజులు ఆడి మంచి రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ మూడు డైరెక్ట్ సెంటర్లలో సిల్వర్ జూబ్లీని జరుపుకొని బాలరాజు మూవీ రికార్డును క్రాస్ చేసింది.

ఇక పాతాళ భైరవి రికార్డుని అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన సువర్ణ సుందరి క్రాస్ చేసింది. ఈ సినిమా కూడా మూడు సెంటర్లలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది.

ఇక ఆ తర్వాత లవకుశ సినిమా ఏకంగా 14 సెంటర్లలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది.

ఇక ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన ప్రేమాభిషేకం సినిమా ఏకంగా 19 సెంటర్లలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది.

ఇక శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి సినిమా ఏకంగా 27 కేంద్రాలలో 175 రోజులు ఆడి అదిరిపోయే రేంజ్ సిల్వర్ జూబ్లీ మూవీ అయ్యింది. అలాగే ప్రేమాభిషేకం సినిమా సిల్వర్ జూబ్లీ రికార్డును కూడా క్రాస్ చేసింది.

ఇక పెళ్లి సందడి రికార్డును సమరసింహారెడ్డి మూవీ తో బాలకృష్ణ క్రాస్ చేశాడు. బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏకంగా 31 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది.

ఇక సమర సింహా రెడ్డి మూవీ ని చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ క్రాస్ చేసింది. ఈ మూవీ 32 సెంటర్లలో 175 రోజులు ఆడి సరికొత్త సిల్వర్ జూబ్లీ రికార్డును సెట్ చేసింది.

ఇక ఆ తర్వాత ఇంద్ర రికార్డును జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సింహాద్రి మూవీ క్రాస్ చేసింది. ఈ మూవీ ఏకంగా 52 సెంటర్లలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది. ఇక ఇప్పటివరకు ఈ రికార్డును ఏ సినిమా కూడా క్రాస్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: