తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ హీరోయిన్ గుర్తుపట్టారా..?

Divya
గతంలో టాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించిన వారిలో హీరోయిన్ అదితి దేవ్ శర్మ కూడా ఒకరు.. ఈమె తాజాగా రెండవసారి అమ్మగా ప్రమోషన్ అందుకున్నట్లుగా తెలియజేసింది. ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం జరిగింది అదితి దేవ్ శర్మ.. దీంతో పలువురు సెలబ్రెటీలు అభిమానులు సైతం ఈ దంపతులకు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే తన భర్తతో దిగినటువంటి కొన్ని బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేసింది అదితి.
అదితి శర్మ 2014లో బాలీవుడ్ బుల్లితెర నటుడు అయిన సర్వర్ అహుజాను ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. అలా 2019 లో వీరికి సర్తాజ్ అనే కుమారుడు కూడా జన్మించారు. ఇప్పుడు మరొకసారి వీరి జీవితంలోకి మరొక ఆడబిడ్డ అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా సోషల్ మీడియా లో  షేర్ చేశారు అదితి దంపతులు.. ప్రస్తుతం పంజాబీ సినిమాలు, బుల్లితెర పైన బిజీగా ఉంటున్న అదితి గతంలో తెలుగు చిత్రాలలో కూడా నటించింది.
ముఖ్యంగా ఉదయ్ కిరణ్ నటించిన గుండె ఘల్లుమంది సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టార్ సినిమాలో కూడా నటించింది. ఇందులో నవదీప్ ,కాజల్ ,నిఖిల్ వంటి వారు నటించారు.. అలాగే బబ్లు సినిమాలో కూడా నటించింది. అయితే సడన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన అదితి శర్మ అన్ని భాషలలో కలుపుకొని 12 కు పైగా చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సీరియల్స్ లలో బిజీగా ఉంటున్న ఇమే పాత్రలకు కూడా మంచి పేరు సంపాదించుకున్నదట. మొత్తానికి ఉదయ్ కిరణ్ సినిమాలో కనిపించిన అది తిని ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టమని పలువురు అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: