నాగచైతన్య, సమంత జంట ప్రేమలోపడి పెళ్లి చేసుకున్నారు. ఏవో కారణాల తో రెండేళ్ల కిందట విడిపోయారు. అయితే, ఇప్పటి వరకు విడాకులపై స్పందించలేదు.వీరిద్దరి విడాకుల నిర్ణయం సినీ అభిమానులందరినీ షాక్‌కు గురి చేసింది. వీరిద్దరూ ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోలేదు. తాజాగా నాగచైతన్య మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. నటి శోభితా ధూళిపాలను త్వరలోనే వివాహం చేసుకోనున్నాడు.ఇదిలావుండ గా నాగచైతన్య, నటి శోభిత పెళ్లి వేడుక డిసెంబర్ 4వ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగనున్నది. ఇప్పటికే పెళ్లి పనులు జోరు అందుకున్నాయి.ఇక సమంత సినిమా ల్లో ఫుల్ బిజీ గా ఉన్నది. ప్రస్తుతం హిందీలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.ఇదిలావుండ గా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టమైన దశ గురించి ముఖ్యం గా విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి మాట్లాడారు.
మహిళలు ఎదుర్కొనే సామాజిక సవాళ్ల గురించి ప్రస్తావించారు. ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారని, దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. తనపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. డివోర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్ తగిలిస్తుంది.సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వృథా, యూజ్డ్' ఇలాంటి ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని ఇవి ఎంతో బాధిస్తాయి. కష్టా ల్లో ఉన్న ఆ అమ్మాయిని ఇవి మరింత నిరాశపరుస్తాయి. నా గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి మాట్లాడాలని అనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులు ఎంతోమంది నాకు మద్దతు గా నిలిచారు అంటూ వారికి ధన్యవాదాలు చెప్పారు సమంత.ప్రస్తుతం ఈ కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.