ఇండియన్ చిత్ర పరిశ్రమలోపెరిగిపోతున్న విడాకుల కల్చర్.. అసలు కారణం ఇదే..!

Amruth kumar
ఇండియన్ లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ విడాకుల వ్యవహారం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచంలో హాట్‌ టాపిక్ గా మారింది .. 29 సంవత్సరాల తమ వివాహ బంధానికి బ్రేక్ ఇచ్చింది ఈ జంట .. జూలైలో అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ పెళ్లిలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ జంట నాలుగో నెలలు తిర‌గ‌కుండానే విడాకులు తీసుకునే అంత గొడవలు ఏం వచ్చాయి అన్నది ఇప్పుడు అందరిలో తెలియని ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవాడని భావోద్వేగాలు , సమస్యలే బంధం విడిపోవడానికి కారణం అన్నది సైరా భాను లాయర్ స్టేట్మెంట్ .. ఇక పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ ఏఆర్ రెహమాన్ తన రిలేషన్ ఎలా ఉందో ఒక పోస్టుతో చెప్పేసాడు.

అయితే  ఈ సంవత్సరం ఒక ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు .. మరో రెండు జంటలు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి కోలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఒకే ఏడాది మామ , అల్లుళ్లు ఏఆర్ రెహమాన్ , జీవీ ప్రకాష్ తమ వివాహ జీవితానికి బ్రేక్ ఇచ్చారు . సింగర్ సైంధవితో తన 11 ఏళ్ల రిలేష‌న్ కు ఎండ్  కార్డ్ వేసాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ . మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉరూతలు ఊగించే ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తన లైఫ్ లోను చేదు బాణీలు మిగించుకున్నాడు . అలాగే ఎంతో అన్యోన్యంగా కనిపించే మరో కోలీవుడ్ స్టార్ జంట జయం రవి - ఆర్తి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక తమ 15 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి - ఆర్తి నుంచి విడాకులు కోరుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఓ టాక్ వైరల్ గా మారింది.

వీరే కాకుండా గతంలో ధనుష్ -ఐశ్వర్య, నాగచైతన్య - సమంత , అమలాపాల్ - ఏఎల్ విజయ్ విడాకుల  న్యూస్ కోలీవుడ్ ఫాన్స్‌ను తెగ బాధపెట్టాయి. ఎన్నో రోజులు కలిసి ఉన్న ఇద్దరి మధ్య సరైన అండర్ స్టాండింగ్, ఒకరినొకరు సరిగా నమ్మకపోవడం వర్క్‌లో పడి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, కొరవ‌డిన ప్రేమ అనురాగాలు ఈ కఠిన నిర్ణయానికి కారణమవుతున్నాయి అన్నది కొంత మంది వాదన . ఇది పూర్తి పర్సనల్ మేటర్ అని కవర్ చూసుకుంటున్నప్పటికీ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే ప్రతి ఇండియన్ ఇలాంటి వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: