అక్కినేని అఖిల్ వంటి హీరోని ఒరేయ్ వెధవా అంటూ తిట్టింది ఎవరు.. అఖిల్ ఎవరి చేత బండ బూతులు తిట్టించుకున్నారు.. అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది ఫ్యాన్స్ వారి అభిమాన హీరో హీరోయిన్లపై ఒక్క మాట కూడా పడనివ్వరు.. ఎవరైనా తమ అభిమాన హీరోని ఒక మాట అంటే మాటకు మాట సమాధానం చెబుతారు.అయితే దీ లెజెండరీ నటుడు అయినటువంటి ఏఎన్నార్ మనవడు స్టార్ హీరో అయినటువంటి నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ని ఓ మహిళ బండబూతులు తిట్టిందట. ఒరేయ్ ఎదవా నువ్వెక్కడ దొరికావు రా నాకు అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందట. మరి ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే.. తెలుగు టీచర్ సరోజ.
ఇక అసలు విషయంలోకి వెళ్తే..అక్కినేని అఖిల్ చిన్నతనంలో సరోజ అనే తెలుగు టీచర్ చదువు చెప్పిన సమయంలో అఖిల్ కి తెలుగు నేర్పించలేక ఎన్నో ఇబ్బందులు పడిందట.అంతేకాదు స్టార్ నటుడు అయినటువంటి ఏఎన్ఆర్ కి వీరాభిమాని అయిన సరోజ తన హీరో మనవడు తన దగ్గర చదువుకున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేదట. కానీ అఖిల్ కి వచ్చే తెలుగును చూసి కన్నీళ్లు పెట్టుకునేదట. అసలు వీడేంటి ఇలా ఉన్నాడు అని తిట్టుకునేదట. ఇక ఓ రోజు సంక్రాంతి పండుగ మీద వ్యాసం రాయమంటే అఖిల్ రాసిన వ్యాసానికి షాక్ అయిపోయిన తెలుగు టీచర్ ఒరేయ్ ఎదవా నువ్వెక్కడ దొరికావు రా నాకు..
అసలు ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటుడి వంశంలో నువ్వెలా పుట్టావురా.. ఏఎన్ఆర్ గారు ఎంత బాగా తెలుగు మాట్లాడతారు. నీకేమో అక్షరం ముక్క రావట్లేదు అని తిట్టిందట.అంతేకాదు అమలకు ఫోన్ చేసి మరీ ఈ విషయాలన్నీ చెప్పేదట. అలా చివరికి ఎలాగో అలా సరోజ గారి దగ్గర అఖిల్ పూర్తిగా తెలుగు నేర్చుకున్నారట.అయితే ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే టాక్ షోలో బయటపెట్టారు.