"కడుపుకి తినేది అన్నమేగా" .. ఫస్ట్ టైం విడాకులపై సమంత ఘాటు కామెంట్స్..!

Thota Jaya Madhuri
సమంత.. ఎప్పుడు కూడా హద్దులు మీరి మాట్లాడదు. హద్దులు మీరిన కామెంట్స్ చేయదు.  చాలా ఇంటర్వ్యూలలో ఆమె విడాకులపై ప్రశ్నించిన కూడా ఆమె నెమ్మదిగానే సమాధానం చెబుతూ వచ్చింది . ఎక్కడో ఒకటో రెండో ఇంటర్వ్యూలలో మాత్రం ఘాటుగా నాగచైతన్యకు తగిలే విధంగా పరోక్షంగా కామెంట్ చేసింది . అయితే సమంత నోటి నుండి ఘాటుఘాటు కామెంట్స్ వినడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది . సమంత కడుపు కడుపు మంటతో రగిలిపోతుంది అన్న విషయాన్ని బయట పెట్టేసింది . త్వరలోనే సమంత మాజీ హస్బెండ్ నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల  పెళ్లి చేసుకోబోతున్నారు.


డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో వీళ్ల పెళ్లి ఘనంగా జరగడానికి నాగార్జున నిశ్చయించారు.  ఇదే మూమెంట్లో సిటాడిల్  వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత వరస ఇంటర్వ్యూలు ఇస్తుంది . ఈ క్రమంలోనే  ఆమె కి విడాకులపై పలు రకాల ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి . ఎప్పుడు అలాంటి ప్రశ్నలు ఎదురవుతున్న సమంత పెద్దగా రియాక్ట్ అవ్వదు.  అయితే ఈసారి మాత్రం ఓపెన్ గానే స్పందించేసింది .


"విడాకులు తర్వాత లైఫ్ ఎలా ఉంది..?  అన్న ప్రశ్నకు "విడాకుల తర్వాత లైఫ్ మనం అనుకున్నట్లు ఉండదు .  మరీ ముఖ్యంగా అమ్మాయిలకు అస్సలు అలా ఉండదు. విడాకుల తర్వాత అమ్మాయిలకు కొన్ని ట్యాగ్స్  ఇచ్చేస్తారు . యూజ్డ్ , సెకండ్ హ్యాండ్ భార్య.  భర్త వదిలేసిన భార్య, అయ్యయ్యో పాపం , ఇప్పుడు ఎలా  బతుకుతుంది ..? ఇలాంటి ట్యాగ్స్ ఎన్నో ఇస్తారు . అసలు నాకు అర్థం కాదు ఎందుకు అలా ట్యాగ్స్ ఇస్తారు అనేది..? అవి ఆ కుటుంబం పై ఎంత రియాక్షన్ చూపిస్తుందో కూడా వాళ్లకు తెలియదు. నేను చాలా స్ట్రాంగ్.. అన్ని బాధలు భరించి బయటికి వచ్చాను ..తట్టుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.  అయితే సమంత మాట్లాడిన పద్ధతికి ఆమె ఎంత హర్ట్ అయింది అన్న విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. దీంతో సమంత ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. " మీరు సమంతని నాగచైతన్య విషయంలో ట్రోల్ చేస్తున్నారు ..అలాంటి వాళ్ళని ఏమనాలి..? అసలు కడుపుకి తినేది అన్నమేగా ..? ఒక అమ్మాయిని ఈ విధంగా ట్రోల్ చేసి ఇబ్బందులు పెడతారా..? అంటూ సమంత ఫ్యాన్స్ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: