జూనియ‌ర్ ఎన్టీఆర్, బ‌న్నీకే మా స‌పోర్ట్... తేల్చేసిన వైసీపీ... ?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా.. ఆ మాటకు వస్తే అసలు వైసీపీకి ఎన్నికలలో కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ టాలీవుడ్‌లో ఇద్దరు హీరోలకు బాగా సపోర్ట్ చేస్తోంది. వారిద్దరూ ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఎంతోమంది హీరోలు ఉంటే వైసీపీ ఈ ఇద్దరికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది..? ఆ లెక్క ఏమిటి..? అంటే ఆసక్తికర విషయమే కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ వాళ్లు దూరం పెడుతూ వస్తున్నారు.

ఎంత అవునన్నా.. కాదన్నా.. జూనియర్ ఎన్టీఆర్‌కు.. చంద్రబాబు, లోకేష్.. అటు బాలకృష్ణతో విభేదాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ కుటుంబంతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. తన పని ఏదో తను చూసుకుంటూ ముందుకు పోతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే.. లోకేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. మొన్న దేవర సినిమాను తెలుగుదేశం శ్రేణులు ఎవరు పట్టించుకోలేదు. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ తెలుగుదేశంకు వ్యతిరేకంగా.. టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నాడు. కాబట్టి బాగా సపోర్ట్ చేశారు. దేవర సినిమాను సోషల్ మీడియాలో బాగా మోసారు. ఇప్పుడు పుష్ప 2 వచ్చింది. బన్నీ పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే జనసేన కేడర్ కు బాగా టార్గెట్ అయ్యాడు. జనసేన ఎక్కడ ఈసారి పుష్ప 2 సినిమాను.. ఎంత మాత్రం ప్రమోట్ చేయమని ఇంకా చెప్పాలి అంటే.. పుష్ప 2కు వ్యతిరేకంగా ఉంటామని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్లు బన్నీ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామంటూ మంచి ప్రమోటర్లుగా మారారు. ఇటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రులుగా ఉన్నారు. వీరికి యాంటీగా వైసీపీ జూనియర్ ఎన్టీఆర్, బన్నీని మోస్తోంది. అంతకుమించి ఈ ఇద్దరు హీరోలపై వైసీపీకి ప్రత్యేకమైన ప్రేమ అయితే ఉంటుందా అంటే వాళ్లే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: