బన్నీ - శ్రీలీల... పుష్ప 2 ఐటెం కిస్సిక్ ఎందుకు తేలిపోయింది... !
పుష్ప 1 సినిమాలో ఊ అంటావా మామ ఐటెం సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో.. పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కూడా అంతకుమించి ఉంటుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కిసిక్ అంటూ లిరిక్‌తో సహా.. ఈ పాట బాగా లేదని చెప్పలేని పరిస్థితి. ఉన్నంతలో ఓకే కానీ.. అది సరిపోదు. సమంత ఐటమ్ సాంగ్ తో పోల్చుకుంటే ఆ సాంగ్‌కు ఏమాత్రం సరితూగదు. ఈ పాటకు అంత స్థాయి లేదు అని అంటున్నారు జనాలు. కనీసం వినగా వినగా.. తినగా తినగా అయినా వైరల్ అయ్యేంత కంటెంట్ ఈ కిస్సిక్ సాంగ్ లో కనిపించడం లేదు అనేది మెయిన్ కంప్లైంట్. అసలు కిస్సిక్ సాంగ్లో ఏ పదాన్ని హైలైట్ చేయాలో.. మ్యూజిక్ డైరెక్టర్‌కు అర్థమైనట్టు లేదు.
సాంగ్ మొదలైన నిమిషం నుంచి కిస్ కిసిక్ అంటూ హమ్మింగ్ వినిపిస్తోంది. ఇందులో కొత్తదనం లేదు. దెబ్బలు పడతాయి అనే హుక్ లైన్ ఎత్తుకున్నారు. అదేదో ముందే తీసుకుంటే బాగుంటుందన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే.. ఈ పాట దేశవ్యాప్తంగా హిట్ అవుతుందా ..అందరికీ కనెక్ట్ అవుతుందా.. సాంగ్‌లో డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయా.. అన్న సందేహాలు ఉన్నాయి. కిస్ కిసిక్కి అంటూ.. బన్నీ, శ్రీలీల వేసిన స్టెప్పులు కూడా కొత్తదనం కనిపించడం లేదు. ఓవరాల్గా చెప్పుకుంటూ పోతే.. హుక్ లైన్, హుక్ స్టెప్.. సాహిత్య పరంగా సమంత, బన్నీ ఐటమ్ సాంగ్తో పోల్చి చూసినప్పుడు.. కిసిక్ ఒక మూలకు రాదని అంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పుష్ప 2 మ్యానియాలో సాంగ్ కూడా హిట్ అవుతుందేమో చూడాలి.