టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి
బాలకృష్ణ ప్రస్తుతం ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే ఆహా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ టాక్ షో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ టాక్ షో కు సంబంధించిన నాలుగవ సీజన్ ప్రారంభం అయింది. ఇక ఇప్పటికే ఈ నాలుగవ సీజన్ కు కూడా చాలా మంది గెస్ట్లు వచ్చారు. అందులో కొంత మంది తమ
సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఈ టాక్ షో కు వచ్చి సందడి చేశారు.
ఇకపోతే కొంత కాలం క్రితం ఈ టాక్ షో కు
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈయన
బాలకృష్ణ తో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను చర్చించాడు. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో నెక్స్ట్
ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఓ రోజు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నెక్స్ట్
ఎపిసోడ్ కి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి
శ్రీ లీల గెస్ట్ గా రాబోతుంది.
ఇక ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మపై ఆన్ స్టాపబుల్ యూనిట్ నెక్స్ట్
ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే
బాలకృష్ణ ఆఖరుగా భగవంత్
కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో
శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఆన్ స్టాపబుల్ లో
శ్రీ లీలా
ఎపిసోడ్ కు ఏ స్థాయి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.