దుల్కర్ సల్మాన్ తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఇకపోతే విడుదల అయిన మొదటి రోజే ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 26 రోజులు అయ్యింది. మరి 26 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
26 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి లక్కీ భాస్కర్ మూవీ కి నైజాం ఏరియాలో 9.72 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.72 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 8.76 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకి 26 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.19 కోట్ల షేర్ ... 36.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 15 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.19 కోట్ల లాభాలను అందుకుని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.