"నాగచైతన్య కి అమ్మ మొగుడు లాంటి మగాడితో సమంత పెళ్లి".. తల్లి సెన్సేషనల్ కామెంట్స్..!?

Thota Jaya Madhuri
సమంత రెండో పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పూటకో వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోతూ ఉంటుంది . సమంత రెండో పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది సమంత అభిమానుల కోరిక అయితే సమంత రెండో పెళ్లి చేసుకోనే చేసుకోను అంటూ పలు సందర్భాలలో పరోక్షకంగానే క్లారిటీ ఇచ్చింది . కానీ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు బయటకు రాగానే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి . మరికొద్ది రోజుల్లోనే నాగచైతన్య - శోభిత  మెడలో మూడు ముళ్ళు వేసి తన రెండో భార్యగా అక్కినేని ఇంటికి కోడలుగా అడుగు పెట్టించబోతున్నాడు.  దీంతో  సోషల్ మీడియాలో ఇప్పుడు మొత్తం అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లకు సంబంధించిన వార్తలు ..వాళ్ల పిక్స్..  వాళ్ళ రిలేషన్ షిప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ వైరల్ అవుతున్నాయి .


ఇదే మూమెంట్లో సమంత సైతం పలు బాలీవుడ్ ఇంటర్వ్యూస్ లలో పాల్గొంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తుంది . "నా మాజీ భర్తకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కి ఖర్చు చేసి తప్పు చేశాను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . అంతే కాదు విడాకులు తర్వాత అమ్మాయిల లైఫ్  సులభంగా ఉండదు అని ఎన్నో ఎన్నో చెత్త ట్యాగ్స్  తో ఇబ్బంది కలుగచేస్తారని కూడా చెప్పుకొచ్చింది".  ఇప్పుడు సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఒక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కపూర్ తో సమంత డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అర్జున్ కపూర్ అనగానే అందరికీ మలైకా అరొరానే  గుర్తొస్తుంది . వీళ్లిద్దరి మధ్య ఎలాంటి ప్రేమాయణం కొనసాగిందో అందరికీ తెలిసిందే .  ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటూ ప్రూవ్ చేసింది మలైకా అరోరా - అర్జున్ కపూర్ జంట.


అయితే తాజాగా వీళ్ళు బ్రేకప్ చెప్పేసుకున్నారు . దానికి కారణం కూడా సమంతనే అంటూ బాలీవుడ్  మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా సమంత పెట్టిన పోస్ట్ కి అర్జున్ కపూర్ రియాక్ట్ అవ్వడం రిప్లై ఇవ్వడం అందరికి కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు ఎవరి పోస్టులకి పెద్దగా రిప్లై ఇవ్వని అర్జున్ కపూర్ ..సమంత పోస్టుకి రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే సమంత - అర్జున్ కపూర్ డేటింగ్ లో ఉన్నారు అన్న విషయం ఇప్పుడు బాలీవుడ్ మీడియాని షేక్ చేసేస్తుంది . అంతేకాదు గతంలో నాగచైతన్య - సమంత డివర్స్  తీసుకున్నప్పుడు సమంత తల్లి చాలా చాలా బాధపడిపోయింది అంటూ వార్తలు వినిపించాయి . సమంత తల్లి - నాగచైతన్య ను బాగా నమ్మింది సమంత కంటే కూడా నాగచైతన్య అంటే నే  ఇష్టం అంటూ వాళ్ళు కలిసినప్పుడు వార్తలు బాగా ట్రెండ్ అయ్యాయి. అలా నాగచైతన్య తన కూతురు జీవితం నాశనం చేయడంతో తల్లి కోపంలో కూడా ఎన్నోసార్లు నాగచైతన్య కన్నా మంచి వ్యక్తిని తీసుకొచ్చి సమంతకి పెళ్లి చేస్తాను అంటూ కుటుంబ సభ్యుల ముందు కూడా  శపధం చేసిందట .


అయితే ఇప్పుడు ఇదే వార్త ని వైరల్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ . తల్లి అన్న విధంగానే నాగచైతన్య కన్నా నాగచైతన్యకు మించిన రేంజ్ లో ఉండే మగాడితోనే సమంత పెళ్లి జరుగుతుంది అర్జున్ కపూర్ - సమంతల పెళ్లి ఫిక్స్ అయితే అది బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అనే అంటున్నారు సామ్ ఫ్యాన్స్ . అయితే సమంత మాత్రం అర్జున్ కపూర్ తో డేటింగ్ పై ఏమాత్రం స్పందించడం లేదు . ఇది కేవలం పుకారేనా ..? లేకపోతే నిజంగానే సమంత - అర్జున్ కపూర్ సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారా..?  కొంపతీసి సమంత ..నాగచైతన్య కోపంతో అతడి ప్రపోజల్ కి ఓకే చెప్పేసిందా ...? రకరకాల ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.  అయితే ఏ ఒక్క దానికి కూడా సరైన ఆన్సర్ రావట్లేదు..!!??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: