తారక్-చరణ్ లని అడ్డంగా ఇరిక్కించేసిన నాగార్జున.. కొత్త హెడేక్ స్టార్ట్ అయ్యిందిరోయ్..!?

Thota Jaya Madhuri
ఇది నిజంగా ఇప్పుడు రామ్ చరణ్ కి అదే విధంగా తారక్ కి పెద్ద టఫ్ సిచువేషన్ అని అంటున్నారు సినీ ప్రముఖులు . ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి..ఈ సామెత కరెక్ట్ గా వీళ్ళకి సెట్ అవుతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.  దానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రిలో  స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న అక్కినేని నాగార్జున అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనకు తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య రెండో పెళ్లి మరి కొద్ది రోజుల్లోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది.  ఈ పెళ్లికి సంబంధించి అన్ని పనులను చకచకా కంప్లీట్ చేసేసింది అక్కినేని అదే విధంగా శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ చాలామందికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఇచ్చేసింది .


ముఖ్యంగా రీసెంట్గా నాగచైతన్య అదే విధంగా నాగార్జున ఇంటికి వెళ్లి మరి తారక్ కి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి కార్డ్స్ ఇచ్చి స్పెషల్గా ఇన్వైట్ చేశారట . దీంతో ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నట్లు అయింది . తారక్ - రామ్ చరణ్ . రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నాగచైతన్య మొదటి భార్యనే  ఈ సమంత . ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లికి రామ్ చరణ్ అటెండ్ అయితే కచ్చితంగా తన నెక్స్ట్ సినిమా హీరోయిన్ సమంతకి కాలిపోతుంది. వెళ్ళకపోతే ఇంటికి వచ్చి పిలిచిన ఫంక్షన్ కి రాలేదా ..? అన్న రేంజ్ లో నాగార్జున మనసు హర్ట్ అవుతుంది. ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక అల్లాడిపోతున్నాడు రామ్ చరణ్ అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.


 మరొక పక్క తారక్ ది  కూడా సేమ్ సిచువేషన్.  తారక్ ఫ్రెండ్స్ లిస్టులో ఉమెన్స్ చాలా తక్కువ ఉంటారు.  మరి ముఖ్యంగా తక్కువ మందిలో ఒకరే సమంత - అలియాభట్ . సమంత ఆయన  ఫ్రెండ్ లిస్టులో ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంటారు . తన ఫ్రెండ్ మాజీ భర్త రెండో పెళ్లికి నేను వెళ్లడం ఏంటి అన్న విధంగా తారక్ ఆలోచిస్తున్నారట. వెళ్తే కచ్చితంగా సమంత హర్ట్ అవుతుంది అంటూ కూడా బాధపడిపోతున్నారట . అయితే నాగార్జునకి తారక్ కి మధ్య చాలా సంబంధాలు ఉన్నాయి . మరి ముఖ్యంగా నాగార్జున .. తారక్ నాన్నగారు హరికృష్ణ ని అన్నా అన్నా అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉండేవాడు. మరి అంత రిలేషన్షిప్ ఉన్న ఆయన ఇంటికి వచ్చి పిలిస్తే పెళ్లికి వెళ్లకపోతే కచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో రామ్ చరణ్ - తారక్ లను ఇబ్బందికర సిచువేషన్ లోకి నట్టేసినట్టే నాగార్జున అంటున్నారు అభిమానులు . చూడాలి మరి ఈ టాలెంటెడ్ హీరోస్ ఎటువంటి డెసీషన్ తీసుకుంటారో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: