Jr. NTR: వామ్మో, తారక్ ఇన్ని భాషలు మాట్లాడతారా.. నిజంగా గ్రేట్ కదా..!
ఇకపోతే రీసెంట్ గా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో వార్ -2 లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా హీరోలు ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడడం మనం చూస్తాం. ఒకవేళ పక్క రాష్ట్రానికి వెళ్తే. తమ సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు కూడా మాక్సిమం ఇంగ్లీషులోనే మాట్లాడుతారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఏ భాష ఇండస్ట్రీకి వెళ్తే అక్కడ ఆ భాష మాట్లాడి ఆడియన్స్ ను మెప్పిస్తారు. ముఖ్యంగా ఈయన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు అనర్గళంగా హిందీ మాట్లాడి ఎలా ప్రేక్షకులను అలరించారో అందరికీ తెలిసిందే.
ఒక హిందీ మాత్రమే కాదు కన్నడ, తమిళ్ భాషలను కూడా ఈయన అవలీలగా మాట్లాడేస్తారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడి, అక్కడివారిని అబ్బురపరిచిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడడం చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ టాలెంట్ కి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే.