ఒకరోజు అక్కినేని బ్రదర్స్ పెళ్లి ?
ఆ అమ్మాయి జైనాబ్ రవ్ డ్జీ అని సమాచారం అందింది. దీంతో ఈ అమ్మాయి కోసం నెటీజెన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా ఆర్టిస్ట్ అని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవేట్ లో పెట్టుకుందట. జైనాబ్ రవ్ డ్జీ ఇండియాతో పాటుగా లండన్, దుబాయ్ లో పెరిగినట్లు సమాచారం. ఆమె తండ్రి జుల్ఫీ రవ్ డ్జీ ప్రముఖ వ్యాపారవేత్త. జైనబ్, అఖిల్ దాదాపు ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
చాలా సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. అనంతరం వారి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి నెటిజెన్లు వీరి పెళ్లి ఎప్పుడా అని ఆరా తీస్తున్నారు. అఖిల్, జైనాబ్ రవ్ డ్జీ జంట చాలా అందంగా ఉంది.
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉన్నారు. డిసెంబర్ 4న నాగచైతన్య, శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుగుతోంది. ఇదే వేదికపై అఖిల్ వివాహం కూడా జరుగుతుందా అని చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ నిజంగా అక్కినేని వారసుల వివాహాలు ఒకే రోజున, ఒకే వేదికపై జరిగినట్లయితే అక్కినేని అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.