ముమైత్ ఖాన్ పేరు వింటే టాలీవుడ్లో హాట్ హాట్ ఐటం సాంగులే గుర్తుకొస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ఐటం సాంగుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది.ఇదిలావుండగా ముమైత్ కుటుంబ విషయానికోస్తే ముమైత్ తల్లి పాకిస్థానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ తాత పాక్ నుంచి ముంబై ప్రాంతానికి వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ఆపై కూతురు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్.అయితే పిల్లల పెంపకం భారం కాగా, తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు రూ. 1500 జీతానికి ఓ డ్యాన్స్ ట్రూప్ లో చేరింది. అక్కడే ఆమె తన ప్రతిభ బయటపడింది.సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేసింది.
ముమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే.తనలో వున్నా ఆ డాన్సింగ్ ప్రతిభను మెచ్చిన పూరి తనకు ఆ పాటలో అవకాశం కల్పించారు.ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ఇక పోకిరి చిత్రంలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే ఐటమ్ సాంగ్టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. ఈ పాటలో ముమైత్ ఖాన్ అద్భుతంగా చిందులు వేసింది. టాలీవుడ్ జనాలకు ఐటమ్ సాంగ్స్ కొత్త కాదు కానీ ఈ పాట మాత్రం సంచలనాలు సృష్టించింది. ఇక ఈ పాట ముమైత్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయగా, ఆపై ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. సుమారు 40 వరకూ హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి.ఈ క్రమంలో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రమ్ లో ఆమె చేసిన ఐటెం సాంగ్స్ క్లిక్ అవ్వడంతో ఈమె డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది.ఈ సినిమాలో ఆ ఒక్క పాట చెయ్యడానికే రూ.40లక్షల నుండీ రూ.50 లక్షల వరకూ ఈమె పారితోషికాన్ని డిమాండ్ చేసింది. అయినా దర్శకనిర్మాతలు ఒప్పుకుని ఆమె అడిగినంత ఇచ్చారు అంటే ఈమె క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటోంది.