జైనాబ్‌తోనూ శ్రీయా భూపాల్ సెంటిమెంట్ ఫాలో అయిన అఖిల్‌... మ‌నోడి కంటే ఎంత పెద్దది అంటే..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
అక్కినేని నాగార్జున రెండో వారసుడు ప్రముఖ టాలీవుడ్ హీరో అందాల నవమన్మధుడు అక్కినేని అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అఖిల్ ఎంగేజ్మెంట్ జైనాబ్ ర‌వ్జ్‌జీతో జరిగినట్టు అఖిల్ తండ్రి సినీ నటుడు నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. జైనాబ్‌ మా ఇంటి కోడలు కాబోతున్నట్టు తెలిపారు. జైనాబ్‌తో  మా వార‌సుడి ఎంగేజ్మెంట్ జరిగిందని తెలియజేసేందుకు ఆనందిస్తున్నా.. అక్కినేని కోడలిగా జైనాబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి అంటూ నాగార్జున పోస్ట్ పెట్టారు. మరోవైపు అఖిల్ కూడా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అక్కినేని ఇంట ఇరు కుటుంబాలు.. అతికొద్దమంది సన్నిహితులు.. బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు.

ఇక జైనాబ్‌ ఎవరు ? ఆమె ఏం చేస్తారు ఆమెతో అఖిల్ కు ఎలాంటి పరిచయం ఉంది ? అనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆమె ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. సోష‌ల్  మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా .. ఇండియాలోనే కాదు దుబాయ్.. లండన్ లోను ఆమె ఆర్టిస్ట్ గా రాణించారు. రెండేళ్ల క్రితం అఖిలతో మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటి కాబోతున్నారు. ఇక జైనాబ్‌ తండ్రి జుల్ఫీ - నాగార్జున మధ్య కొన్ని నీళ్లుగా స్నేహబంధం ఉంది. డిసెంబర్ 4న నాగచైతన్య - శోభిత వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో ఈలోగా అక్కినేని ఇంట మరో శుభకార్యం జరగడంతో అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా అఖిల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే అఖిల్ కు కాబోయే భార్య జైనాబ్‌ వయసులో అఖిల్ కంటే చాలా పెద్దది అంటున్నారు. జైనాబ్‌ వయసు 39 కాగా .. అఖిల వయసు 30 ఇలా చూస్తే వీరిద్దరి మధ్య ఏకంగా తొమ్మిదేళ్లు గ్యాప్ ఉంది. అలాగే మీనాక్షి సినిమా టైం నుంచి మ‌రో లెక్క ప్ర‌కారం చూసుకున్నా అఖిల్‌ కంటే జాయిన్ అయిదేళ్లు పెద్ద.... గతంలో అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రీయా భూపాల్ కూడా వయసులో అఖిల కంటే పెద్దదైన విషయం తెలిసిందే. మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ అఖిల్ తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: