పుష్ప 2కు అల్లు అర్జున్ పారితోష‌కం చుక్క‌ల్లోనే... ఇండియా లోనే నెంబ‌ర్ 1 హీరో... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ఎవడ్రా ఎవడ్రా నువ్వు .. ఇనుమును ఇనుమును నేను .. నన్ను కాల్చితే కత్తి అవుతాను ఇది పుష్ప సినిమా లో ఏయ్‌ బిడ్డ ఇది నా అడ్డ సాంగ్లో లిరిక్స్. అల్లు అర్జున్ ఇప్పుడు నిజంగా కత్తిలా రికార్డులను ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. తాజాగా పుష్ప 2 సినిమాతో దేశంలో అత్యధిక పారితోషకం తీసుకున్న‌ నటుడుగా నిలిచాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ త్రిల్లర్ పుష్ప 2.. ది రూల్. రష్మిక హీరోయిన్ .. శ్రీలీల‌ ప్రత్యేక  గీతంలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగ‌జైన్‌ దిఫోర్బ్స్ ఇండియాలో 2024 లో అత్యధిక పారితోష‌కం తీసుకున్న టాప్ - 10 నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ రు. 300 కోట్ల పారితోషకం తో మొదటి స్థానంలో నిలిచాడు. పుష్ప 2 - ది రూల్‌ కోసం ఆయన ఈ స్థాయిలో పారితోష‌కం అందుకున్నట్టు తన కథనంలో పేర్కొంది.

తమిళ‌ కథానాయకుడు ఇళ‌య‌ దళపతి విజయ్ ఇటీవల వచ్చిన గోట్ - ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం - లియో సినిమాలతో పాటు రాబోయే తన 69వ సినిమా కోసం రు.  275 కోట్లు చార్జి చేస్తున్నారట. ఇప్పుడు విజయ్ ని మించిపోయి అల్లు అర్జున్ ఏకంగా రు. 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆ మాటకు వస్తే పుష్ప 2 కోసం ప‌ని చేసిన  నటీనటులు అందరూ కూడా భారీ మొత్తంలో పారితోషకం అందుకున్నారట. హీరోయిన్గా నటించిన రష్మిక పది కోట్లు తీసుకోగా .. విలన్ గా చేసిన ఫ‌హాద్ ఫాజిల్ రు. 8 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ట్రీజర్లు - ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. పుష్పరాజ్ ను ఢీకొనే పాత్ర బన్వర్‌సింగ్ షుకావత్ పాత్రలో అలరించనున్నాడు. ఇక కిసిక్ కోసం ఒక్క పాట‌లో బ‌న్నీ ప‌క్క‌న ఆడిపాడిన శ్రీలీల ఈ ఒక్క పాట‌ కు రెండు కోట్లు తీసుకున్నారట. ఈ పాట 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన సౌత్ ఇండియన్ సాంగుగా రికార్డు సృష్టించింది. డిసెంబర్ 5న ఫస్ట్ పార్ట్ 2 తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ - హిందీ - బెంగాలీ భాషల్లో విడుదల అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: