జైనబ్ - అక్కినేని అఖిల్ కు అక్క వరుస అవుతుందా..? వావి వరసలు లేకుండా పెంట పెంట చేసేసారుగా.!
కాగా అక్కినేని అఖిల్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దీంతో అమలా - నాగార్జున ఫుల్ సంతోషంగా హ్యాపీగా ఉండిపోయారు . కాగా త్వరలోనే అక్కినేని ఇంట శుభకార్యం జరగబోతుంది. నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్ళి ఘనంగా జరగడానికి పెద్దలు నిశ్చయించారు. ఇదే మూమెంట్ లో బ్యాక్ టు బ్యాక్ అక్కినేని ఫ్యామిలీలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి అంటూ తెలుసుకొని అభిమానులకు ఖుషి అవుతున్నారు . అఖిల్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూతురు జైనబ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు .
గత కొంతకాలంగా ఆమెతో ప్రేమాయణం నడుపుతున్న ఈయన ఫైనల్లీ ఆమెతో నిశ్చితార్ధం చేసుకుని అభిమానులకి సర్ ప్రైజ్ ఇచ్చాడు. గత కొంత కాలంగా ఇద్దరు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు . ఇదే మూమెంట్లో ఇరు కుటుంబ సభ్యులకి ఆ విషయం చెప్పారు . ఇరు కుటుంబాలు కూడా ఆ పెళ్ళికి ఒకే చెప్పడంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే జైనబ్ .. అక్కినేని అఖిల్ కంటే దాదాపు తొమ్మిది సంవత్సరాలు పెద్దది అన్నట్లు సమాచారం అందుతుంది .
అలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . దీంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు అక్కినేని హేటర్స్. దాదాపు 9 ఏళ్ళు పెద్దది అంటే అఖిల్ కు వరుసకు అక్క అవుతుంది . మరి అక్క వరుస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా..? ఇదేం సంప్రదాయం రా బాబు ..వావివరసలు లేవా ..? అంటూ ఘాటుగా అక్కినేని హేటర్స్ ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు మాత్రం ప్రపంచంలో అఖిల్ అక్కినేని మాత్రమే తనకంటే వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు అని .. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇప్పటికీ అలా పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయారు అని అఖిల్ చేసిన పనిని సమర్థిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరొకసారి అక్కినేని అఖిల్ పేరు మారుమ్రోగిపోతుంది..!