అక్కినేని అఖిల్ -జైనబ్ ల మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఆ తెలుగు స్టార్ హీరో భార్యా..? వెలుగులోకి సంచలన నిజాలు..!

Thota Jaya Madhuri
"జైనబ్" నిన్న మొన్నటి వరకు కూడా ఈ పేరు ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో ఓ  రేంజ్ లో హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతుంది. దానికి కారణం ఆమె త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ బడా హీరో అక్కినేని నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతుంది . అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం చేసుకుంది . దీనికి సంబంధించిన ఫోటోలు అదేవిధంగా అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. మరి ముఖ్యంగా అసలు ఈ జైనబ్ రవ్జీ ఎవరు..? అఖిల్ కు ఎలా పరిచయమైంది..? వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది..?  ఎలా కొనసాగింది..?  వీళ్ళ మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఎవరు..? అంటూ చాలా చాలా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు .


ఇలాంటి క్రమంలోనే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది . అఖిల్ - జైనబ్ ల మధ్య ప్రేమ పుట్టడానికి పరోక్షకంగా కారణం స్టార్ హీరో భార్య మిహికా బజాజ్ అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మిహికా బజాజ్ చాలా చాలా క్లోజ్ . రానా - మిహికా పెళ్ళికి కూడా జైనబ్ వచ్చిందట.  అక్కడే అఖిల్ తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది . ఆ పరిచయం స్నేహంగా మారి .. ఆ స్నేహం ప్రేమగా మారింది అని ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లి బంధంగా మార్చుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .


అంతేకాదు అఖిల్- జైనబ్ ల  ప్రేమకు పరోక్షకంగా కారణమైంది మిహికా అంటూ ఓ రేంజ్ లో ఈ వార్తను ట్రెండ్ చేసేస్తున్నారు జనాలు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ పెళ్లి మార్చి 17వ తేదీ జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 4వ తేదీ అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళీపాళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగబోతుంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునను భలే ట్రోల్ చేశారు జనాలు.  ఇద్దరు కొడుకులను లైఫ్ లో సెటిల్ చేయలేకపోయాడు ..అసలు ఇతను ఏ హీరో అంటూ దారుణంగా ట్రోల్ చేశారు . అలాంటి వాళ్లకు సైలెంట్ గానే షాక్ ఇచ్చేసాడు అక్కినేని నాగార్జున. ఇద్దరు కొడుకులకు బ్యాక్ టు బ్యాక్ మంచి అమ్మాయిలను చూసి పెళి  చేయడానికి ముహూర్తాలను కూడా ఫిక్స్ చేసుకున్నారు . దీంతో సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునను బాగా పొగిడేస్తున్నారు అక్కినేని అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: