అఖిల్ కి కాబోయే భార్య ఆ విషయంలో కత్తి..హీరోయిన్స్ కూడా వేస్ట్..!

Thota Jaya Madhuri
జైనబ్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరు ఓ రేంజ్ లో హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతూ అక్కినేని ఇంటికి కాబోయే కోడలు అంటూ ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు . దానికి కారణం ఆమె అందం.  సాధారణంగా అఖిల్ అక్కినేని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే కచ్చితంగా ఆ వార్తలు కొన్ని గంటలు ట్రెండ్  అవుతాయి ..వైరల్ అవుతాయి.  కానీ జైనబ్ విషయంలో మాత్రం అంతకు మించిన స్థాయిలోనే ఫ్యాన్స్ అదేవిధంగా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దానికి బిగ్ రీజన్ ఆమె అందంగా ఉండడం .


ఇంత అందమైన అమ్మాయి ఎలా అక్కినేని అఖిల్ కి పడిపోయింది..? అఖిల్ ని పెళ్లి చేసుకోవడానికి ఓకే చేసింది..? అది కూడా అతగాడికి ఇదివరకే నిశ్చితార్ధం అయ్యి బ్రేక్ అప్ అయిందని కూడా తెలుసు..పైగా అక్కినేని అఖిల్ కన్నా చాలా చాలా టాలెంటెడ్.  సొంతకాళ్లపై నిలబడే వ్యక్తి . మరీ ముఖ్యంగా కాస్మెటిక్స్ రంగంలో నెంబర్ వన్ స్థాయిలో ఉంది.  అలాంటి జైనబ్ ఎలా అక్కినేని అఖిల్ ను ఇష్టపడింది..? అనేది ప్రశ్నార్థకంగా మారింది . అయితే కొంతమంది మాత్రం అక్కినేని అఖిల్ కి కాబోయే భార్య చాలా చాలా అందంగా ఉంది అని.. ఇప్పటి వరకు అక్కినేని  ఇంటికి కోడలు  అయిన వారు ఇంత అందంగా ఎవరూ లేరని చెప్తున్నారు.


ఆ మాటకొస్తే సినిమా ఇండస్ట్రీలో కూడా ఏ స్టార్ హీరోయిన్ అందం ముందు సరిపోదు అని .. నిజంగా ఆ విషయం అఖిల్ చాలా అదృష్టవంతుడు అంటూ ఓ  రేంజ్ లో పొగిడేస్తున్నారు.  మరీ ముఖ్యంగా కాస్మెటిక్స్ రంగంలో ఉంది గనుక ఎటువంటి కేరింగ్ ప్రొడక్ట్స్ ముఖంపై పెట్టాలి అన్న విషయంపై అవగాహన ఉంటుంది అంటూ .. ఆ కారణంగానే ఆమె ఇంత అందంగా ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు . మొత్తానికి ఒకే ఒక్క దెబ్బతో అక్కినేని అఖిల్ తన పేరుకి మళ్ళీ పునర్ వైభవం అందుకునేలా చేసాడు . ఇక మార్చిలో వీళ్ల పెళ్లి  జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అంతే కాదు వీళ్ళ పెళ్లి గోవాలో జరగబోతుందట.  దీనికోసం ఇప్పటికే నాగార్జున - అమల బిగ్ భారీ ప్లాన్స్ కూడా వేసేసారట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: