పెళ్లిపై సడన్ ట్విస్ట్ ఇచ్చిన కీర్తి సురేష్.. ఊహించలేదుగా..?

Divya
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయస్థాయి అవార్డు కూడా లభించింది. మొత్తానికైతే తన నటనతో అందరినీ అబ్బుర పరిచిన ఈమె..  సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే కీర్తి సురేష్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాతో తొలిసారి గ్లామర్ గర్ల్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం బోల్డ్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది కీర్తి సురేష్. ఇప్పటివరకు ఈమె గురించి పలు రకాల వార్తలు రాగా.. స్పందించని ఈమె  తాజాగా ఈ వార్తలపై స్పందించింది. గత 15 సంవత్సరాలుగా ఆంటోనీ,  నేను ప్రేమలో ఉన్నాము అంటూ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో ని కూడా షేర్ చేస్తూ...తాను ప్రేమలో ఉన్న విషయాన్ని డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది.
ఇకపోతే ఇది అభిమానులకు బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆ అబ్బాయి గురించి ఎక్కడ కూడా వార్తలు రాలేదు. అతడితో కలిసి దిగిన ఫోటోలు కూడా లేవు కానీ సడన్గా 15 ఏళ్ల ప్రేమ అనేసరికి అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావ్ ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. నిజంగానే నువ్వు గొప్ప మహానటివి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: