అఖిల్‌ కు పిల్లనిచ్చే మామ బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే..దిమ్మతిరగాల్సిందే ?

Veldandi Saikiran

అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజలు మోగనున్నాయి. డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య, శోభిత వివాహం జరగనుంది. దీంతో ఇరు కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే అక్కినేని యంగ్ హీరో అఖిల్ నిశ్చితార్థం అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగినట్లు తాజాగా అక్కినేని నాగార్జున అనౌన్స్ చేశాడు. జైనబ్ రావడ్జీతో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగిందని నాగార్జున వెల్లడించారు.

తమ కుటుంబంలోకి కోడలిగా జైనబ్ రావడ్జీకి ఆహ్వానం పలుకుతున్నామని ఆమె రాకతో మా కుటుంబంలో మరింత సంతోషం కలిగిందని నాగార్జున తెలియజేశారు. ఈ విషయం తెలిసి అఖిల్ ఫ్యాన్స్ సంబరంలో మునిగి తేలుతున్నారు. తాజాగా తెలిసిన మరొక విషయం ఏమిటంటే...... అఖిల్ కి కాబోయే మామగారి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది అని సమాచారం అందుతుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఆయన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ టైకోన్. వేలకోట్లకు అధిపతి అని టాక్ వినిపిస్తోంది.

రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అఖిల్ మామకు అనుభవం ఉంది. జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా అతను పనిచేసినట్లుగా తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా అతను పని చేశాడు. మొత్తానికి ఒక కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ పదవి జగన్ ప్రభుత్వం అతనికి కట్టబెట్టింది.
జుల్ఫీ రావడ్జీనీ నవంబర్ 13, 2019 ప్రత్యేక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం అప్పట్లో జీవో కూడా జారీ చేసింది. మొత్తానికి అఖిల్ మామ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది అని తెలిసి అందరూ సంబరంలో ఉన్నారు. కాగా, జైనబ్ రావడ్జీ, అఖిల్ ఆరేళ్ల నుంచి సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: