నయనతారకు షాక్... ఆమె పరువు తీసేందుకు హీరో ధనుష్ భారీ స్కెచ్...?

Veldandi Saikiran
తమిళ స్టార్ హీరోయిన్  నయనతార కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హీరోయిన్ నయనతార పై  రివర్స్ అటాక్ చేసేందుకు ధనుష్ రెడీ అయ్యాడు. ఇందులో భాగంగానే తాజాగా నయన్ పై రివర్స్ కేసు పెట్టాడు ధనుష్. ప్రస్తుతం నయనతార అలాగే, హీరో ధనుష్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల నయన తారకు సంబంధించిన  డాక్యుమెంట్.. నెట్ ఫ్లిక్స్  లో రిలీజ్ అయింది. బియాండ్ ద ఫెరిటెల్  పేరుతో ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయింది.
 
అయితే ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత నయనతార అలాగే హీరో ధనుష్ మధ్య వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇందులో నాను రౌడీ డాన్ సినిమాలో నుంచి మూడు సెకండ్ల వీడియోను... హీరోయిన్ నయనతార కోసం వాడుకోవడం జరిగింది. దీనిపై హీరో ధనుష్ సీరియస్.. కావడం జరిగింది. ఆ సినిమాకు చిత్ర నిర్మాతగా ధనుష్ ఉన్నారు. అందుకే మూడు సెకండ్ల వీడియోను వాడుకోవడం పై సీరియస్ అయి... హీరోయిన్ నయనతార కు లీగల్ నోటీసులు పంపారు.
 
అక్కడితో ఆగకుండా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు హీరో ధనుష్. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ ఆఫ్ అయింది.  హీరో ధనుష్ నోటీసులు పంపడంతో...  తమిళ హీరోయిన్ నయనతార అలాగే ఆమె భర్త విగ్నేష్ కూడా సీరియస్ అయ్యారు. హీరో ధనుష్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. హీరో ధనుష్ ఇంత చీప్ గా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మూడు సెకండ్ల వీడియో వాడుకుంటే తప్పేంటి అనే యాంగిల్ లో  నయనతార కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు.
 
అయితే వరుసగా ఇదే విషయంపై ధనుష్ ను టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు. దీంతో రెచ్చిపోయిన ధనుష్... నయనతార పై తాజాగా కేసు పెట్టాడు. హీరోయిన్ నయనతార తో పాటు ఆమె భర్త విగ్నేష్ పైన కూడా కేసు పెట్టాడు. వారిద్దరి పైన మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు వేశాడు హీరో ధనుష్. తన అనుమతి లేకుండా నయనతార తన డాక్యుమెంటరీలో... మూడు సెకండ్ల వీడియోను వాడుకున్నారని.. నిర్మాతగా ధనుష్ కేసు వేశారు. మరి దీనిపైన నయనతార ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: