వావ్: పుష్ప-2 షూటింగ్ ఏఏ ప్రాంతాలలో జరిగిందో తెలుసా.. ఏపీలో ఎక్కడంటే..?

Divya
టాలీవుడ్ లో అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక, సుకుమార్ కాంబినేషన్లో డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న పుష్ప-2 చిత్రం కోసం చాలా మంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. పుష్ప రాజ్ కథలో తదుపరి భాగం ఏంటన్నది పుష్ప-2 లో చూపించబోతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం కూడా జోరుగానే ప్రమోషన్ చేస్తున్నది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2 చిత్రం షూటింగ్ ఎక్కడెక్కడ జరిగింది ఏ ఏ ప్రాంతాలలో జరిగిందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ 2022 అక్టోబర్ 30న హైదరాబాదు నుంచి ప్రారంభమై మొదటి షెడ్యూల్ ముగిసిన తర్వాత రెండవ షెడ్యూల్ 2023 లో విశాఖపట్నంలో జనవరి నెలలో ప్రారంభించారట. అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించిన సన్నివేశాలు అలాగే విశాఖపట్నం పోర్టులో చిత్రీకరించిన యాక్షన్స్ సన్నివేశాలు థియేటర్లో హైలైట్ గా ఉంటాయని సమాచారం. ఇక జనవరి నెలలో షూటింగ్ ముగిసిన తర్వాత రెండు నెలలకు మార్చిలో బెంగళూరులో అల్లు అర్జున్, రష్మిక సినిమా షూటింగ్ని ప్రారంభించారట.

బెంగళూరులో రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలలో ఒడిస్సా లోని మల్కాన్ గిరి జిల్లాలో ఫారెస్ట్ కు సంబంధించిన షూటింగ్ని చిత్రీకరించారట. 2023 ఆగస్టులో ఎక్కువ భాగం షూటింగ్ని హైదరాబాద్లోనే జరిపారు. ఇక తర్వాత 2024 మార్చిలో ఆంధ్రప్రదేశ్లోని యాగంటి ఆలయంలో పుష్ప-2 కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందట. అలాగే పుష్ప సినిమా కోసం నిజమైన మేకింగ్ ఇండియా ప్రాజెక్ట్ అనడానికి 1990,2000 సంవత్సరంలో జపాన్, మలేషియా ఎలా ఉండేది అనే విధంగా కొన్ని సెట్స్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్మించారట. మొత్తానికి పాన్ ఇండియా లేవల్లే ఈ సినిమా షూటింగ్ కూడా భారీగానే జరిగినట్టు కనిపిస్తోంది. ఏపీలోనే రెండు ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ని జరపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: