పారితోషకం ఎగ్గొట్టాడు.. మామ నాగార్జునపై సుమంత్ కంప్లైంట్.. !

RAMAKRISHNA S.S.
అక్కినేని హీరో సుమంత్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించాడు. వరుస విజయాలతో మంచి స్టార్‌డం సొంతం చేసుకున్నాడు. దివంగత లెజండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడుగా సినిమాల్లోకి వచ్చిన సుమంత్.. ప్రేమకథలు, ఇటు మాస్‌ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని మంచి కథలు ఎంపిక చేసుకున్న తర్వాత కథల ఎంపికలు చేసిన పొరపాట్లతో పాటు.. తన స్థాయికి తగిన కథలు ఎంపిక చేసుకోకపోవడం అక్కినేని ఫ్యాన్ బేస్‌ను సరిగా ఓన్ చేసుకోకపోవడంతో రేసులో వెనకబడిపోయాడు. దీంతో సుమంత్ కెరీర్ బాగా డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బలమైన క్యారెక్టర్లు కూడా చేస్తున్నాడు. సుమంత్ హీరోగా సినిమాలకంటే.. వెబ్ సిరీస్, ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలలో మెరుస్తున్నాడు.

ఇటీవల సార్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. సీతారామం సినిమాలోని బలమైన పాత్రలో మెప్పించాడు. హీరోగా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు సుమంత్. తన పాత ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బ‌స్టర్ సినిమా.. దేశముదురు సినిమాని మిస్ చేసుకున్నట్టు చెప్పాడు. పూరీ క‌థ‌ను మొదట తనకే చెప్పాడని.. తాను నో చెప్పటం వల్ల.. అల్లు అర్జున్ అన్నాడు. ఈ సినిమా చేసి ఉంటే సుమంత్ కెరీర్ కచ్చితంగా మరోలా ఉండేది అనటంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే.. సుమంత్ తన మొదటి పారితోషం గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. సుమంత్ హీరోగా పరిచయం అవుతూ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేమ కథ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా చివర్లో హీరో, హీరోయిన్లు చనిపోతారు. దీంతో.. సినిమా డిజాస్టర్ అయింది. తమ పాత్రలు చనిపోవడం వల్ల సినిమా పోయిందని సుమంత్ చెప్పాడు. ఈ సినిమాకు సుమంత్ పారితోషం తీసుకోలేదు. అన్నపూర్ణ స్టూడియో నాగార్జున ఈ సినిమా నిర్మించాడు. ఆ తర్వాత యువకుడు సినిమాలోను సుమంత్ నటించగా.. సుమంత్ కి జోడిగా భూమిక హీరోయిన్గా నటించింది. కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మాత. ఈ సినిమా యూత్ లో మంచి ఆదరణ పొందింది. రొమాంటిక్ డ్రామాగా యువతను ఆకట్టుకుంది. మొదటిసారి ఈ సినిమాకు సుమంత్‌కు నాగార్జున రెమ్యూనరేషన్ ఇచ్చాడట. అది కూడా సగం కట్ చేసి ఇచ్చాడట. అన్ని కట్ చేసుకుని చివరకు ఐదు లక్షలు చేతిలో పెట్టడని సుమంత్ తెలిపాడు. ఆలీతో సరదాగా షోలో సుమంత్ ఈ విషయాన్ని బయట పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: