సినిమా తారలు ఏం చేసినా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే చేస్తారు. కొన్నిసార్లు ఎంతో రిస్క్ చేసి నటిస్తుంటారు. నటించకూడని సన్నివేశాల్లోనూ ప్రేక్షకులను మెప్పించడం కోసమే నటిస్తారు. అలాంటి సన్నివేశాల్లో నటించినప్పుడు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మలయాల నటి దివ్య ప్రభ కూడా అలాంటి పరిస్థితినే ఎదురుకున్నారు. దివ్య ప్రభ డైరెక్టర్ పాయల్ కపాడియా దర్శకత్వంలో ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్ లో అవార్డు దక్కించుకుంది.
ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు కూడా ఈ అవార్డు రాలేదు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమా లో దివ్య ప్రభ బోల్డ్ సన్నివేశాలలో నటించాల్సి వచ్చింది. కాగా సినిమాలో ఆమెకు సంబంధించిన కొన్ని న్యూడ్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వీడియోలు సోషల్ మీడియాలోకి లీకై చాలా రోజులు అవుతుంది. అయితే తాజాగా లీక్ అయిన వీడియోలపై దివ్య ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సినిమాకు సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది నిజంగా దారుణమని తాను ఆ పాత్ర కోసం ఒప్పుకున్నప్పుడే ఇలా జరుగుతుందని ఊహించినట్టు చెప్పారు. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పటికీ మలయాల మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదని అన్నారు. లీకైన వీడియోలను షేర్ చేసిన వారు మన దేశ జనాభాలో 10% మంది మాత్రమే ఉన్నారని అన్నారు. వాళ్ళ మనస్తత్వం ఏంటో తనకు అర్థం కాలేదని.. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నట్టు చెప్పారు. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిలిం బోర్డులో ఉన్నారని తమ చిత్రానికి సెన్సార్ బోర్డు ఆమోదం లభించిందని అన్నారు. అదే తమకు ముఖ్యమని, ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తానని చెప్పారు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే అలాంటి సన్నివేశాల్లో చేస్తానని విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.