ఆంధ్రావాలాలో హీరో మృతి...ఆ లాజిక్ మిస్ కాకుంటే మూవీ బ్లాక్ బస్టర్ ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు ప్రేమ కథాంశం తో వస్తుంటే... మరికొన్ని సినిమాలు క్రైమ్ నేపథ్యంలో వస్తున్నాయి. ఇక మరికొన్ని సినిమాలైతే... హారర్ నేపథ్యంలో వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలుస్తున్నాయి. ఇక కొన్ని సెంటిమెంట్ సినిమాలు కూడా ఉంటాయి. మరికొన్ని సినిమాల్లో హీరోలే చనిపోతారు. అయితే హీరోలు చనిపోయిన చాలా సినిమాలు సక్సెస్ కాలేదు.
 అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా ఒకటి. ఆంధ్ర వాళ్ళ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 2004 జనవరి ఒకటో తేదీన సంక్రాంతి కానుకగా అప్పట్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఆర్ఆర్ వెంకట్, కోన వెంకట్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంగీతం అందించింది చక్రి అయితే.. నిర్మాణ కంపెనీగా శ్రీ భారతి ఎంటర్ప్రైజెస్ ఉంది.
అయితే ఈ సినిమాలో...  జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన... రక్షిత నటించారు.  ఈ సినిమా మొత్తం కార్మికులు, యాక్షన్ నేపథ్యంలో వచ్చింది. ఇందులో తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర ఉంటుంది. ఓ ఏరియాలో... అక్కడ ఉన్న జనాలకు అండగా నిలుస్తూ... తండ్రి పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్... కనిపిస్తారు.
 వాళ్లకు ఇలాంటి కష్టం వచ్చినా... ఆదుకుంటారు. విలన్స్ నుంచి కాపాడుతారు. ఈ తరుణంలోనే ఆంధ్రావాలగా ఆ ఏరియాలో... ఎదుగుతాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే... ఈ సినిమా కథ డిమాండ్ చేసిన నేపథ్యంలో...  జూనియర్ ఎన్టీఆర్ మరణించేలా సీన్ క్రియేట్ చేశారు పూరి జగన్నాథ్. దీంతో అక్కడి నుంచి మరో ఎన్టీఆర్... కొడుకు పాత్రలో ఎంట్రీ ఇస్తాడు. అయితే ఇక్కడ వరకు బాగున్న... మొదటి ఎన్టీఆర్ మరణించడంతో ఈ సినిమాకు మైనస్ అయింది. దీంతో సినిమా పెద్దగా ఆడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: