భీమిలి కబడ్డీ జట్టు.. నాని అసిస్టెంట్ డైరెక్టర్న నుండి హీరోగా అష్టా చమ్మా, రైడ్ వంటి సినిమాలు చేసి హిట్టు కొట్టిన తర్వాత విడుదలైన సినిమా భీమిలి కబడ్డీ జట్టు..ఈ సినిమా కంటే ముందు చేసిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ భీమిలి కబడ్డీ జట్టు మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అలా ఎంతోమంది అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరి ఈ సినిమా ఎక్కడ బెడిసి కొట్టింది అనేది ఇప్పుడు చూద్దాం..
విమర్శకుల ప్రశంసలు అందుకున్న భీమిలి కబడ్డీ జట్టు :
నాని హీరోగా..శరణ్యమోహన్ హీరోయిన్ గా.. ధనాధన్ ధనరాజ్,చలాకి చంటి, తాగుబోతు రమేష్ వంటి వాళ్లు నాని ఫ్రెండ్స్ గా కబడ్డి కోచ్ గా నటుడు కిషోర్ అలాగే వితికా షెరూ ఇప్పటీ యంగ్ హీరోల్లో ఒకరైన సిద్దు జొన్నలగడ్డ,వినయ్ రాయ్ వంటి తారాగణంతో తెరకెక్కిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2010 జూలై 9 విడుదలైంది.ఈ సినిమాకి ఆర్బి చౌదరి నిర్మాతగా చేయగా తాతినేని సత్య దర్శకత్వం వహించారు. వెన్నిల కబడి కుళు అనే తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన భీమిలి కబడ్డీ జట్టు మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీ విడుదలయ్యాక వారం రోజులపాటు బాగానే కలెక్షన్స్ సంపాదించినప్పటికీ వారం రోజుల తర్వాత సినిమాని ఎక్కువగా ఆదరించలేదు. దానికి కారణం సినిమా మౌత్ టాక్ లేకపోవడం. ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడుకోకపోవడంతో మంచి సినిమా తొందరగానే థియేటర్ల నుండి తీసేశారు.
అయితే చాలా చోట్ల ఈ సినిమాకి సంబంధించి బ్రేక్ ఈవెన్ జరిగింది.కానీ కొన్ని చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు. కానీ తక్కువ బడ్జెట్ సినిమా కావడంతో బయ్యర్లు కూడా అంతగా లాస్ అవ్వలేదు.. అద్భుతంగా తెరకెక్కిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూసి నాని నిద్ర కూడా పోలేదట. ఎందుకంటే హిట్ అవుతుంది అనుకున్న సినిమా సోసో గా ఉంది అని టాక్ రావడంతో నాని ఎంతగానో బాధపడ్డారట. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. చివర్లో నాని కబడ్డీ కూతకు వచ్చిన వ్యక్తి కాళ్లు గట్టిగా పట్టుకోవడంతో భీమిలి కబడ్డీ జట్టు విన్ అవుతుంది.
ఆ తర్వాత కాసేపు అది పక్కన పెట్టేసి ఊరి జాతర హీరోయిన్ ఎంట్రీ చూపిస్తారు.సడన్గా నాని ఫోటోకు దండేసి ఆ ఫోటో ముందు నాని తల్లి పడుకోవడంతో ప్రేక్షకులందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే నాని చనిపోయారు కాబట్టి. డైరెక్టర్ సడన్ ట్విస్ట్ ఇవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక కబడ్డీ కూతకు వచ్చిన వ్యక్తి నానిని కాలితో గట్టిగా గుండె మీద తన్నడంతో అక్కడే నాని గుండె ఆగిపోతుంది. అలా హీరో చనిపోవడం చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి నాని నిద్రపోలేదట.ఎందుకంటే సినిమా మొత్తం బాగుంది కానీ చివర్లో హీరో చనిపోవడం బాలేదు అని చెప్పేసరికి ఆయనకు చాలా రోజుల వరకు నిద్ర పట్టలేదట.