తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచారు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి. విలనిజమైనా, కామెడీ అయినా, సహాయ పాత్రలైనా తన మార్క్ చూపారు. అన్నింటికి మంచి మనిషిగా, మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహరి. తన వద్దకు ఎవరొచ్చినా తనకు చేతనైన సాయం చేసి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. మరణించి 11 ఏళ్లు కావొస్తున్నా తెలుగు చిత్ర పరిశ్రమపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నారు డాక్టర్ శ్రీహరి. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యం, మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి.ఇదిలావుండగా ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఒక్కరోజు షూటింగ్ చేస్తే మీ రోల్ కంప్లీట్ అవుతుందని ప్రభుదేవా చెప్పడంతో శ్రీహరి ముంబైకి వెళ్లారని సెట్‌లో దోమలు కుట్టడం వల్ల ఆయనకి జ్వరం వచ్చిందని తెలిపారు. జ్వరానికి రాంగ్ ఇంజెక్షన్ చేయడంతో శ్రీహరి ఆరోగ్యం దెబ్బతిందని నాతో , పిల్లలతో మాట్లాడారని కాసేపటికి లోపలికి వెళ్లి చూసేసరికి ఆయన కళ్లు, ముక్కు, నోట్లో నుంచి రక్తం వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. యూనిట్ సభ్యులు ఆయనను హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 2013 అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. శ్రీహరి హఠాన్మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.ఈ నేపథ్యంలో తన ఆహారపు అలవాట్ల గురించి శాంతి ఇలా అంటూ చక్కెరకేళి, అరటిపండు, సీతాఫలం అంటే శ్రీహరికి బాగా ఇష్టమని డాక్టర్ దానిని ఇవ్వొద్దన్నారు. జాండీస్ వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని, కానీ షూటింగ్‌లో నాన్ వెజ్ తినడంతో ఆరోగ్యం దెబ్బతిందని శాంతి తెలిపారు.భోజనం విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని కానీ తనకు తెలియకుండా వాళ్ల ఫ్రెండ్స్ నాన్ వెజ్ పెట్టారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.