అక్కినేని అఖిల్.. మొదటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందో తెలుసా..?
ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న బైనాబ్ రావిడ్జ్ అయితే ఈమె అసలు పేరు ఏంటన్న విషయం మాత్రం ఇంకా అభిమానులకు అర్థం కావడం లేదు. కానీ అఖిల్ చేసుకోబోయే అమ్మాయి మాత్రం బడ వ్యాపార సంస్థకు చెందిన కూతురు అన్నట్లుగా సమాచారం.. అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసని వార్తలు వినిపిస్తున్నాయి. బైనాబ్ తండ్రి ఆంధ్రప్రదేశ్ సలహాదారునుగా గతంలో జగన్ ప్రభుత్వంలో పని చేశారని సమాచారం. వ్యాపారంతో పాటు అటు నాగార్జున ,నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారితో కూడా ఈయనకు మంచి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. అందుకే నాగార్జున తనని కోడలుగా చేసుకోబోతున్నట్లు సమాచారం.
అక్కినేని అఖిల్ మొదటిసారి ఎంగేజ్మెంట్ 2016 లో ఫ్యాషన్ డిజైనర్ జీవీకే రెడ్డి మనవరాలు అయిన శ్రియ భూపాలతో చాలా గ్రాండ్ గా జరిగింది.. అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే వివాహాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు రెండో సారి ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మొదటిసారి శ్రేయాతో ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నారనే విషయం వైరల్ గా మారుతున్నది. అప్పట్లో ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత శ్రీయా, అఖిల్ మధ్య విమానాశ్రమంలో ఒక పెద్ద గొడవ జరిగిందని అదే వీరు పెళ్లికి ముందు విడిపోవడానికి గల కారణం అన్నట్లుగా సమాచారం. ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించిన వీరిద్దరూ యుగో వల్ల మనసుని మార్చుకోలేకపోయారని టాక్ నడిచింది. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా నాలుగేళ్లు ఉండడం అందుకు కూడా విడిపోవడానికి కారణమని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అసలు విషయం ఏంటన్నది సస్పెన్స్ గానే ఉన్నది.