ప్రభాస్ లాంటి కొడుకు కావాలని చెబుతున్న దేవర తల్లి.. ఈ హీరో నిజంగా లక్కీ!
మళ్లీ జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తల్లి రోల్ లో ఆమె నటిస్తున్నారు. తాజాగా ఒక హిందీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ప్రభాస్ ఎంతో గొప్ప మనిషి అని అలాంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో చూడలేదని ఆమె తెలిపారు.
ప్రభాస్ సెట్ లో ప్రతి ఒక్కరినీ క్రాఫ్ట్స్ తో సంబంధం లేకుండా సమానంగా చూసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. నాకు ఆకలేస్తుందని చెబితే ప్రభాస్ ఫోన్ చేసి 40 నుంచి 50 మందికి ఫుడ్ తెప్పిస్తారని వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు కావాలని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. వైజాగ్ లో పుట్టి పెరిగిన జరీనా వాహబ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్, ప్రొడ్యూసర్ ఆదిత్య పాంచోలినిని ఆమె పెళ్లి చేసుకున్నారు. జరీనా చేసిన కామెంట్ల గురించి ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇలా అందరి అభిమానాన్ని పొందుతున్న ప్రభాస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. జరీనా తెలుగులో వరుసగా మూవీ ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం. ప్రభాస్ తన లుక్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ది రాజాసాబ్ మూవీతొ ప్రభాస్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.