పొలిటికల్ సినిమాలకు సరికొత్త అర్థం చెప్పిన రానా తేజ మూవీ.. ఆ ట్విస్టులు నెక్స్ట్ లెవెల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. రానా తేజ కాంబినేషన్ లో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. 2017 సంవత్సరం ఆగష్టు 11వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పాలి. రానా తేజ మూవీ పొలిటికల్ సినిమాలకు సరికొత్త అర్థం చెప్పింది.
 
ఈ సినిమాలో కేథరిన్ పాత్రతో ఇచ్చిన ట్విస్టులు మాత్రం మామూలు ట్విస్టులు కావు. తేజ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రాగా తర్వాత రోజుల్లో తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు సినిమాలో ప్రతి సీన్ హైలెట్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో రానా పాత్ర చనిపోతూ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
రానాకు సైతం సోలో హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో భారీ సక్సెస్ దక్కింది. రానా ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో, క్రేజీ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. రానా రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. రానా పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు సక్సెస్ సాధించే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
 
నేనే రాజు నేనే మంత్రి సినిమాకు ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రానా మరోవైపు టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రానా ఎలాంటి పాత్రలో నటించినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుండటం గమనార్హం. రానాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: