బిజినెస్‌మేన్‌ : సూర్య భాయ్ పొలిటికల్ బిజినెస్.. ట్రెండ్ సెట్ చేసిందిగా..!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ ఉంటుంది.. వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయం సాధించాయి.. మహేష్, పూరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీపోకిరి “.. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాతో సూపర్ స్టార్ తిరుగులేని విజయం అందుకున్నాడు.. దర్శకుడు పూరీ జగన్నాధ్ మాస్ ఫైట్స్, డైలాగ్స్ ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ చేసాయి.. మహేష్ మేనరిజం సినిమాకె హైలైట్ గా నిలిచింది.. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టు మాత్రం ప్రేక్షకులను సీట్స్ లో కూర్చోనివ్వకుండా చేసింది.. మహేష్, పూరీ కెరీర్ లో పోకిరి సినిమా మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది.. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ “బిజినెస్‌మేన్‌ ”.. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. 


రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని పూరీ జగన్నాధ్ తనదైనా స్టైల్ ఆఫ్ మేకింగ్ తో అద్భుతంగా తెరకెక్కించాడు.. పూరీ సినిమా అంటే కచ్చితంగా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండాల్సిందే.. షార్ట్ డైలాగ్స్ అయినా బుల్లెట్స్ లా దూసుకొస్తాయి  .బిజినెస్‌మేన్‌  లో ప్రతీ డైలాగ్ కూడా ప్రేక్షకుడిగా పిచ్చ కిక్ ఇస్తుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ గ్లామర్ సినిమాక్ హైలైట్ గా నిలిచింది.. ముఖ్యంగా మహేష్ కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. విలన్ గా ప్రకాష్ రాజ్ అద్భుత నటన కనబరిచారు.. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోతుంది.. ముఖ్యంగా బాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉంటుంది.. పూరి మార్క్ డైలాగ్స్, డైరెక్షన్, తమన్ మ్యూజిక్, మహేష్ యాక్టింగ్, కాజల్ గ్లామర్ ఈ సినిమాకు సూపర్ హిట్ అని అందించాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: