కూలి నుండి ఎమ్మెల్యేగా.. రాజకీయం చూపించి హిట్టు కొట్టిన చిరంజీవి?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎన్నో రకాల సినిమాలు వస్తూ ఉంటాయ్. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిని తో చేస్తే బ్లాక్ బస్టర్ విజయలను సాధించడం చూస్తూ ఉంటాం.అయితే ఇలా పొలిటికల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా తేడా కొట్టింది అంటే చాలు సినిమా హిట్ అవ్వడం గురించి పక్కన పెడితే హీరోలపై తీవ్ర స్థాయిల విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే అటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా విషయంలో ఇలా ఏకంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యి సాహసమే చేశాడు. అంతేకాదు ఈ సినిమాతో ప్రేక్షకుల మదిని గెలుచుకోవడమే కాదు బ్లాక్ బస్టర్ హిట్టు కూడా కొట్టేశాడు.

 ఆ సినిమా ఏదో కాదు ముఠామేస్త్రి.అప్పట్లో కోదండరామిరెడ్డి - మెగాస్టార్ కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే వారిద్దరికీ అప్పటికే ఎన్నో హిట్ మూవీస్ ఉన్నాయి. దీంతో మరోసారి కాంబినేషన్ లో వచ్చిన ముఠామేస్త్రి కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. రాజకీయం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. బోసు అనే పాత్రలో చిరంజీవి ఈ మూవీలో కనిపిస్తాడు. కూరగాయల మార్కెట్లో కూలీ పని చేసే బోసు.. ఇక మార్కెట్లో అన్యాయం జరగకుండా చూస్తూ ఉంటాడు. మార్కెట్లో ఆత్మ పాత్రలో నటించిన శరత్ సక్సేన.. ఒక ముఠా నాయకుడిగా కొనసాగుతూ అందరిని వేదిస్తూ ఉంటాడు. ఇక అతని అరాచకాలను ఎదుర్కొంటూ ఉంటాడు బోసు. అతని ఫాలోయింగ్ చూసి ముఖ్య మంత్రి గుమ్మడి వెంకటేశ్వరరావు ఫిదా అయిపోతాడు. బోసును రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తాడు.

 దీంతో ఎన్నికలు ఎమ్మెల్యేగా నిలబడితే బోసు భారీ మెజారిటీతో గెలుస్తాడు. దీంతో మంత్రి పదవి కూడా వస్తుంది. అయితే ఇలా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బోసు ఆత్మ అన్యాయాలను ఎలా ఎదుర్కొన్నాడు. ఇక తన రాజకీయ చతురతను ఎలా చూపించాడు అన్నది స్టోరి. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారు అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించాడు కోదండరామిరెడ్డి. ఇక చిరు తన నటనతో విశ్వరూపం చూపించి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. మొత్తంగా రాజకీయ నేపథ్యంలో ఒక సినిమా తీసి చిరంజీవి ముఠామేస్త్రిగా సూపర్ హిట్టు కొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: