రంగం సినిమాకి .. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రివాల్‌కు ఉన్న లింక్ ఇదే..!

Amruth kumar
కొన్నిసార్లు డబ్బింగ్ సినిమాలే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ అవే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధిస్తుంటాయి. అప్పట్లో అపరిచితుడు, గజిని, ప్రేమిస్తే అలాంటి విజయాలనే సాధించి తెలుగు సినిమాలకు కూడా షాక్ ఇచ్చాయి. అలాంటి అద్భుతమైన మ‌రో సినిమా రంగం. ఈ మధ్యే కరోనాతో మరణించిన లెజెండరీ సినిమాటోగ్రఫర్, అద్భుతమైన దర్శకుడు కేవీ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించాడు. జీవా హీరోగా రాధ పెద్ద కూతురు కార్తిక, పియా బాజ్‌పెయీ హీరోయిన్లుగా వచ్చిన ఈ పొలిటికల్ మీడియా థ్రిల్లర్ సంచలన విజయం సాధించడమే కాకుండా జీవాకు తెలుగులో మార్కెట్ ఓపెన్ చేసింది. తమిళంలో కో పేరుతో కలెక్షన్స్ వర్షం కురిపించి తెలుగులో రంగంగా విడుదలైంది. ప్రకాశ్ రాజ్, అజ్మల్ ఈ సినిమాలో తమ నటనతో మైమరిపించారు.

ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఓ ఫోటోగ్రాఫర్ గా పనిచేసే హీరో అశ్విన్ .. నేటి వార్త అనే పేపర్ సంస్థలో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తాడు స్థానిక బ్యాంకును దోచుకుంటున్న నక్సలైట్లను ఛేదించి మరీ వారి ఫోటోలను తీస్తాడు అశ్వద్ధామ. అయితే తాను మారువేషంలో నక్సలైట్ గ్యాంగ్ లో చేరిపోయి వారి ఫోటోలు తీస్తుండగా రేణుక అతడిని నిజంగానే దొంగా అని భావించి పట్టుకుంటుంది. అనంతరం ఆ రేణుక నేటి వార్తా పేపర్ లో ఆర్టికల్ ఎడిటర్ గా పని చేస్తుందని తెలుస్తుంది. ఆ విధంగా వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. అశ్వత్ చదువుకునే రోజుల్లో అతడికి వసంత్ అనే ఒక స్నేహితుడు ఉంటాడు. అతను రాజకీయరంగ ప్రవేశం చేసి నవతరం పార్టీని స్థాపిస్తాడు. తన స్నేహితుడు ఎన్నికలలో పోటీ చేస్తున్నాడని తెలిసిన అశ్వత్ తన నేటి వార్త సహోద్యోగుల, ముఖ్యంగా రేణుక, సహాయంతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న యోగి( ప్రకాష్ రాజ్), ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న కోటశ్రీనివాసరావు చేసే అక్రమాలను, అన్యాయాలను బయట పెట్టి వసంత్ ఎన్నికలలో గెలిచేందుకు సహాయపడుతుంటాడు.

ఇదే క్రమంలో హీరో ఫ్రెండ్ వసంత్ నిర్వహించిన పార్టీ సభలో బాంబు పేలుగా యశ్వంత్ తన స్నేహితుడు వసంతని కాపాడుతాడు కానీ తన వార్తాపత్రికలో పనిచేసే సరుకుని మాత్రం కాపాడలేక పోతాడు ఆమె ఎలా చనిపోతుందో తాను సీసీ కెమెరాలు పరిశీలించి అసలైన నీకు నిజమెంటో హీరోో తెలుసుకుంటాడు. అక్కడి నుంచి సినిమా చివరి వరకు చాలా త్రిలింగంగ్ గా ఉంటుంది.. జీవ అజ్మల్ అమీర్ కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ కార్తీకజీవ అజ్మల్ అమీర్ కోట శ్రీనివాసరావు ప్రకాష్జీవ అజ్మల్ అమీర్ కోట శ్రీనివాసరావు ప్రకాష్రాజ్ కార్తీకతో మెప్పించారు అలాగే పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో  మెప్పించింది. గతంలో ఈ సినిమా స్టోరీ అనే పలు రాజకీయ నాయకులకు పోలుస్తూ వార్తలు ఆర్టికల్స్ కూడా వచ్చాయి.. ప్రధానంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్  కు ఈ సినిమా స్టోరీ కరెక్ట్ గా సరిపోతుందని ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. రంగం సినిమా ఆరోజుల్లోనే రాజకీయంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: