శంకర్ నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయేది ఆ తెలుగు హీరోనే.. సినీ చరిత్రను తిరగరాయబోతున్న వీఫ్ కాంబో..!?
కాగా రీసెంట్ గానే ద్ రామ్ చరణ్ తో గేమ్ చేంజెర్ అనే మూవీ ని తెరకెక్కించాడు . ఈ సినిమా జనవరి 10వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అంతేకాదు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు శంకర్ . అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏకంగా అమెరికాలో జరపడానికి నిశ్చయించుకున్నారు . దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన పాట కూడా అద్భుతంగా అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చింది . మరి ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ మాత్రం శంకర్ మార్క్ ఏంటో మరోసారి గుర్తు చేసేలా చేశాయి . అయితే ఇప్పుడు శంకర్ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా తెరకెక్కించబోతున్నాడు అనే విషయం బాగా వైరల్ గా మారింది.
అయితే గ్లోబల్ స్టార్ లాంటి హీరో రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించిన తర్వాత అలాంటి స్థాయి ఉన్న హీరోతోనే సినిమా తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ వార్తలు వినిపించాయి . సరిగ్గా ఇదే మూమెంట్లో శంకర్ తన నెక్స్ట్ వర్క్ చేసే హీరో ఇతడే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఎస్ చిరంజీవితో శంకర్ ప్రతిష్టాత్మకమైన ఫిలింను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే ఇది ఎప్పుడు సెట్స్ పై కి వెళ్తుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది . ఒకే ఒక్కడు సినిమా పొలిటికల్ పరంగా ఎంత హీట్ పెంచేసిందో అందరికీ తెలిసిందే . అలాంటి ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో శంకర్ - చిరంజీవి కోసం ఒక మూవీను ప్లాన్ చేశారట . ఆ మూవీకి సంబంధించిన కథను కూడా వివరించారట. చిరంజీవి సైతం ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది . ఒకవేళ అదే నిజమైతే మాత్రం సినీ చరిత్రను తిరగరాసే విఐపి కాంబో సెట్ అయినట్లే అంటున్నారు జనాలు . వీళ్ళ కాంబోలో చాలా సినిమాలు తెరకెక్కడానికి ట్రై చేశారు . కానీ లాస్ట్ మినిట్ లో అన్ని ఫెయిల్ అయిపోయాయి. చూడాలి మరి ఈ కాంబో ఈసారైనా సెట్ అవుతుందో లేదో..???