"ఆ విషయం నాకు ముందే తెలుసు రా బాబు"..సమంత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
ఈ ఒక్క మాటతో నాగచైతన్య పరువు తీసేసినట్లయింది సమంత. అయితే ఆ తర్వాత కూడా విడాకులు పై పరోక్షకంగా స్పందిస్తూనే వచ్చింది . విడాకులు తీసుకున్న తర్వాత ఒక అమ్మాయి లైఫ్ మామూలుగా ఉండదని చాలా చాలా ట్యాగ్స్ తో హింసిస్తారు అని.. భర్త వదిలేసిన భార్య, సెకండ్ హ్యాండ్ అంటూ అవహేళనగా మాట్లాడుతారు అని చెప్పి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది . అయితే ఇవన్నీ సమంతకి ముందే తెలుసు అట . సమాజంలో సమంతా - నాగచైతన్య మాత్రమే మొదటిగా విడాకులు తీసుకోలేదు . అంతకు ముందే చాలామంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు.
అయితే విడాకులు తర్వాత ఎలాంటి ట్రోలింగ్ చేస్తారని తెలిసి కూడా సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె ఎదుర్కొన్న సిచువేషన్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . సమంతకి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పేరును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అని కెరియర్ పరంగా ఎదగనివ్వరని ముందే తెలుసు అట . అయినా సమంత తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎక్కడ తగ్గించుకోకూడదు అన్న కారణంగానే విడాకులు తీసుకుందట . విడాకులపై సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు త్వరలోనే అఖిల్-జైనబ్ ల పెళ్ళి కూడా జరగబోతుంది. ఈ విషయాని అఫిషియల్ గా ప్రకటించాడు నాగార్జున..!