నటుడు సుబ్బరాజు భార్య ఎవరో తెలుసా..? ఏం చేస్తుందంటే?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ నటుడు సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. సుబ్బరాజు కొన్ని సినిమాల్లో కమెడియన్ గా మరికొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. అయితే సుబ్బరాజు ఇటీవలే స్రవంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తన భార్యతో కలిసి దిగిన ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫైనల్ గా పెళ్లి చేసుకున్నాను అంటూ తెలిపాడు. దీంతో అతని మ్యారేజ్ ఫోటో వైరల్ గా మారింది. అలాగే సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? ఏంటి? అని ప్రేక్షకుల మదిలో ప్రశ్నలు మొదలయ్యాయి.
 అయితే ఇప్పుడు సుబ్బరాజు భార్య ఎవరు ? ఏం చేస్తుందో ? మనం ఇప్పుడు చూద్దాం.. ఇకపోతే మన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు స్రవంతి. ఆమె కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీలు పొందారు. ఇప్పుడు స్రవంతి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నార్త్‌వుడ్ డెంటల్ సెంటర్స్‌లో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. సైన్స్ అంటే తనకి చాలా ఇష్టం. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. తన ఫస్ట్ లవ్ సైన్స్ అని, మ్యారీడ్ టు ఫిట్‌నెస్ అని తన ఇన్‌స్టా బయోలో స్రవంతి మెన్షన్ చేశారు. అమెరికాలోని  ఫ్లోరిడాలోనే  స్రవంతి కుటుంబం ఉంటున్నట్లు తెలిసింది.
సుబ్బరాజు, అతని భార్య స్రవంతికి ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం అంట. అయితే వీరి పెళ్లి హైదరాబాద్‌లో చేసుకుంటే సినీ రంగానికి చెందిన వారిని, ప్రముఖులను పిలవక తప్పదు, పిలవకపోవడం పద్ధతి కాదని అనుకున్నారంట. అందుకని సుబ్బరాజు సొంతూరు భీమవరంలో పెళ్లి చేసుకున్న ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఈ జంట భావించింది. అట్టహాసంగా చేసుకునే పెళ్లిళ్లపై అంత ఆసక్తి లేని సుబ్బరాజు, స్రవంతి అమెరికాలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల మాత్రమే పెళ్లికి పిలిచి సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారట. పెళ్లి అమెరికాలో చేసుకున్నప్పటికి ఘనంగా రిసెప్షన్ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్  నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: