ప్రమోషన్స్ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఐకాన్ స్టార్.. మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తున్నాడుగా..!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మొన్నటి వరకు మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2 షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మూడేళ్ల పాటు షూటింగ్ జరగ్గా.. తన డేట్స్ అన్నీ ఆ సినిమాకే ఇచ్చేశారు.మరో ప్రాజెక్ట్ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. రీసెంట్ గా పుష్ప సీక్వెల్ షూటింగ్ పూర్తైనట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐదేళ్ల పుష్ప జర్నీ ముగిసిందని తెలిపారు.ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు బన్నీ. డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టేలా కనిపిస్తున్నారు. పుష్పరాజ్ గా మళ్ళీ తన స్వాగ్ తో అలరించనున్నారు అల్లు అర్జున్.అదే సమయంలో ఇప్పుడు ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో జరుగుతున్న ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. నాన్ స్టాప్ గా దేశమంతా తిరుగుతున్నారు. నార్త్ టు సౌత్.. సినిమాపై ఉన్న బజ్ ను క్యాష్ చేసుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అందులో సక్సెస్ అయ్యేలా కూడా కనిపిస్తున్నారు.
పుష్ప టీమ్ తో కలిసి వరుసగా బడా సిటీస్ లో నిర్వహిస్తున్న ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు అల్లు అర్జున్. షూటింగ్ తో మొన్నటి వరకు బిజీగా.. ఇప్పుడు ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు. ఎక్కడ ఏ ఈవెంట్ అయినా అక్కడి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. వేరే లెవెల్ లో ఆదరణను దక్కించుకుంటున్నారు.దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప-2 ప్రమోషన్స్ గురించి జోరు సాగుతోంది. బన్నీ క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నాన్ తెలుగు స్టేట్స్ లో బన్నీకి అందుతున్న రెస్పాన్స్ అదుర్స్ అని చెబుతున్నారు. పుష్ప రాజ్ చేస్తున్న ప్రమోషన్స్ అసూయ పడేలా ఉన్నాయని అంటున్నారు.ఇప్పుడు బన్నీ ప్రమోషన్స్ తీరు చూస్తుంటే.. అందులో పది శాతం కూడా తమ హీరో ఎఫర్ట్ పెట్టలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో బన్నీ ప్రమోషన్స్ ను 50% మ్యాచ్ చేసినా చాలు అని రామ్ చరణ్ అభిమానులు అనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆయన గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ప్రమోషన్స్ విషయంలో బన్నీని చూసి నేర్చుకోవాలని పలువురు హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: