' పుష్ప 2 ' .. ఏపీ - తెలంగాణ‌లో బన్నీ ముందు బిగ్ టార్గెట్.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. మరో నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సినిమా సెన్సార్ టాక్ అంటూ ఒకపక్క హడావుడి మొదలైంది. సినిమా సెన్సార్ చేసిన సభ్యులలో ఎవరో ఉత్సాహవంతులు మొత్తం కథ అంతా బయటకు చెప్పేసినట్టు ఉంది. దీంతో సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కథ‌ ఇది అంటూ చెక్కర్లు కొట్టేస్తుంది. ఇదంతా ఇలా ఉంటే.. టికెట్ల బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అవుతుంది.. మంచి ఓపెనింగ్ తీసుకుంటుంది అనుకుంటున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిసి ఎంత వసూలు సాధించాల్సి ఉంటుంది అన్నది పాయింట్. ఆంధ్రాలో రూ.90 కోట్ల మేరకు , నైజాంలో రూ.100 కోట్లు , సీడెడ్‌లో రూ.30 కోట్లకు పుష్ప 2 సినిమాను బయ్యర్ల కు విక్రయించారు. 18 శాతం జీఎస్టీలు, థియేటర్ రెంట్లు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, 20 శాతం కమిషన్.. అన్ని తీసేయగా రూ.250 కోట్లు రావాల్సి ఉంటుంది. అంటే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.450 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఇది చాలా పెద్ద ఫీట్. అంటే బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమా రేంజ్ కలెక్షన్లు రావాలి. అంత రన్నింగ్ ఉండాలి. కేవలం రెండు వారాల్లో వచ్చేసే టార్గెట్ కాదు ఇది. విడుదలైన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్లీ పండగ టైంలో థియేటర్లో ఉండేలా చూసుకోవాలి. పుష్ప 1కు నిర్మాతల‌ డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు రేట్ల‌కు.. ఇప్పుడు రేట్లు డబుల్ తేడా ఉంది. మరి సినిమా డబుల్‌ రేంజ్ హిట్ కావాలి. ఫ్యామిలీ అంతా తరలి రావాలి. ఏది ఏమైనా పుష్ప 2 సినిమాతో బన్నీ ముందు చాలా పెద్ద టాస్క్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: