సమంత నుంచి అనుష్క వరకు అందం కోసం ఆ పని చేసే హీరోయిన్లు వీరే..!

Amruth kumar
కోవిడ్ సమయంలో ఒత్తిడి ఆరోగ్య నిర్వహణ కోసం యోగా ప్రాముఖ్యత బాగా పెరిగింది. సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఆరోగ్యంకాపాడుకోవడం కోసం యోగ వెంట పడుతున్నారు. ఫిట్నెస్ దినచర్యలో యోగాను ఒక భాగంగా చేసుకున్న‌ స్టార్ హీరోయిన్ల గురించి ఇక్కడ చూద్దాం.  ఫిట్నెస్‌కు ఐకాన్ గా సమంత, ప్రతిరోజు ఏరియల్ యోగాను ఎక్కువగా ఆచరిస్తారు. తలక్రిందులుగా వేలాడుతూ చేసే ప్రక్రియతో ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇక మ‌రో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే లాక్ డౌన్ సమయంలో తన యోగ ఆసనాలతో ఫిట్‌నెస్ ను కాపాడుకోవడంతో పాటు అద్భుతమైన ఫలితాలను కూడా సాధించారు. ఇప్పటికి తను అందంగా ఉండడానికి కారణం తన యోగాన్ని అంటూ ఎప్పటికప్పుడు దీపిక చెప్తూనే ఉంటారు.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్  మలైక ఆరోరా కూడా యోగ చేయడంతో పాటు మద్దతుగా పలు  కార్యక్రమాలు కూడా చేస్తారు .. అలాగే తాను ఫిట్టిగా ఉండటంతో పాటు ముంబైలో యోగ స్టూడియో ని కూడా నడుపుతున్నారు ఈ సీనియర్ హీరోయిన్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి యోగా సాధకురాలు మాత్రమే కాదు యోగా టీచర్ .. అనుష్క యోగా చేయటంలో మాస్టర్స్ చేసింది .. ప్రతి ఒక్కరి జీవితంలో యోగ ఒక భాగం కావాలని ఈమె ప్రచారం కూడా చేస్తుంది. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కూడా  అందంగా ఫిట్ గా ఉండటానికి ఏరియల్ యోగ, మరియు సూర్య నమస్కారం తో పాటు యోగ ఆసనాలు వేస్తారు. ఇదే తనకు ఆరోగ్యకరమైన జీవనశైలికి మారుపేరుగా మారాయని ఆమె చెబుతూ ఉంటారు.

మరో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ శ్రియ కూడా పెళ్లయి పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇంత అందంగా నాజుగా ఉండడానికి కార‌ణం.. ఆమె రోజు చేసే యోగ ఎంతో ఫిట్గా ఉంచుకుంటుంది. తన శరీరంపై తాను పట్టు సాధించి తో పాటు తనను తాను కంట్రోల్  చేసుకోగలదని  కారణం యోగా అని ఎప్పుడూ చెబుతారు శ్రియ. మరో సౌత్‌ స్టార్ హీరోయిన్ త్రిష కూడా 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఎంతో నాజుగా ఉండడానికి కారణం యోగానే తనకు ఇష్టమైన వ్యాయామంగా యోగాను ఉపయోగిస్తుంది త్రిష జిమ్ లో ఇబ్బంది పడే బదులు ఇంట్లో ప్రశాంతంగా యోగా చేయటం మేలు అని ఈ స్టార్ హీరోయిన్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: